Coffee: కాఫీ తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుందా?

నైట్ షిఫ్ట్ చేసేవారు నిద్ర రాకుండా ఉండటానికి ఎక్కువగా కాఫీ తాగుతుంటారు. అయితే కాపీ అధికంగా తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుందని కొందరు అంటుంటారు. మరి ఇందులో నిజమెంత? తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By: Kusuma Aggunna, Updated On : October 26, 2024 7:18 pm

Coffee Day

Follow us on

Coffee: చాలామందికి కాఫీ అంటే ఇష్టం ఉంటుంది. ఉదయం లేచిన వెంటనే తప్పకుండా కాఫీ తాగుతారు. వేడి కాఫీతో రోజు స్టార్ట్ కావడం వల్ల డే అంతా యాక్టివ్‌గా ఉంటారు. కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని కూడా భావిస్తారు. పొద్దున్న లేచిన వెంటనే అసలు కాఫీ తాగకపోతే కొందరికి రోజు కూడా గడవదు. అయితే కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కెఫిన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల రాత్రిళ్లు నిద్ర కూడా సరిగ్గా పట్టదు. అయితే కొందరు రోజులో ఎక్కువసార్లు కాఫీ తాగుతుంటారు. రోజుకి ఒకటి లేదా రెండు సార్లు కంటే అధికంగా టీ తాగుతారు. మైండ్ రిఫ్రెష్ కావాలని, నిద్రపోవాలని అధికంగా సేవిస్తారు. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ చేసేవారు నిద్ర రాకుండా ఉండటానికి ఎక్కువగా కాఫీ తాగుతుంటారు. అయితే కాపీ అధికంగా తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుందని కొందరు అంటుంటారు. మరి ఇందులో నిజమెంత? తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

 

కాఫీలో ఉండే కెఫిన్ శరీరానికి తక్షణమే శక్తిని ఇస్తుంది. అలాగే రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. అయితే కాఫీ తాగిన వెంటనే ఒక్కసారిగా రక్తపోటు పెరుగుతుందట. దీనివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేకపోయిన అధికంగా తాగకూడదని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు కాఫీని తక్కువ మోతాదులో తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తపోటు అధికం అయితే కొన్నిసార్లు గుండె పోటు వచ్చే ప్రమాదాలు కూడా ఉంటాయి. కాబట్టి కాఫీని మితంగా తీసుకోవడమే మేలు. ఒకవేళ మీరు డైలీ కాఫీ తీసుకున్నట్లయితే వైద్యుని సంప్రదించిన తర్వాత సూచనలు మేరకు తీసుకోవడం ముఖ్యం. మధుమేహం ఉన్నవారు కూడా కాఫీని అధికంగా తాగకూడదు. వీటికి బదులు గ్రీన్ టీ, మందార టీ, బ్లాక్ టీని తాగడం మంచిదని నిపుణులు అంటున్నారు.

 

కేవలం రక్తపోటు సమస్య ఉన్నవారు మాత్రమే కాకుండా జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా కాఫీ తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కడుపులో నొప్పి, ఉబ్బరం, ఎసిడిటీ సమస్యలు ఉన్నవారు కూడా కాఫీకి దూరంగానే ఉండాలి. ముఖ్యంగా గర్భిణులు అయితే అసలు కాఫీ జోలికి వెళ్లకపోతేనే బెటర్. కొందరు డిప్రెషన్‌లో ఉంటారు. అలాంటి వారు కూడా కాఫీ తాగకపోతే మంచిది. కొందరికి రాత్రి పూట పూర్తిగా నిద్రపట్టదు. అలాంటివారు కాఫీ తాగడం వల్ల ఇంకా నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి నిద్రలేమితో బాధపడేవారు కాఫీని అసలు తాగవద్దు. ఒకవేళ తాగితే నిద్రకు ఆటంకం కలుగుతుంది. దీంతో నీరసం, అలసట వంటి సమస్యలు కొత్తగా వస్తాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు కొన్ని రోజుల పాటు కాఫీకి దూరంగా ఉండటం మంచిది.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.