Coffee: ఉదయం లేచిన వెంటనే కాఫీ(Coffee) తాగకపోతే కొందరికి అసలు రోజూ కూడా గడవదు. సాధారణంగా ఎవరికైనా సూర్యోదయంతో(Early Morning) డే స్టార్ట్ అయితే.. కొందరికి మాత్రం కాఫీతోనే స్టార్ట్ అవుతుంది. కాఫీ ప్రేమికులు రోజులో ఎన్నిసార్లు తాగుతారో అసలు లెక్క ఉండదు. సమయం సందర్భం లేకుండా కాఫీలు తాగుతుంటారు. అయితే కాఫీ ఉదయం కాకుండా రోజులో ఏ సమయంలో అయిన తాగినా ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. ఉదయం కాకుండా మిగతా సమయంలో కాఫీ తాగడం వల్ల అనారోగ్య సమస్యల(Health Issues) బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే కాఫీని ఉదయం పూట మాత్రమే తాగాలని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం కాకుండా ఉదయం సమయాల్లో కాఫీ తాగడం వల్ల మరణాల రేటు తక్కువగా ఉంటుంది. అలాగే గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి కాఫీని సాయంత్రం కాకుండా ఉదయం సమయాల్లో మాత్రమే కాఫీ తాగాలని చెబుతున్నారు.
చాలా మంది కాఫీ, టీ అంటే ఎక్కువగా తాగుతారు. అయితే వీటి కంటే బ్లాక్ కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. రోజూ తాగడం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం 12 శాతం తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది. బ్లాక్ కాఫీ తాగని వారికంటే తాగే వారిలో సగం సమస్యలను తగ్గించవచ్చు. బ్లాక్ కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే కొందరు బ్లాక్ కాఫీకి పంచదార వేసుకుని తాగుతారు. పంచదార కాకుండా బ్లాక్ కాఫీని తాగాలని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీల వల్ల దంత సమస్యలు రావు. అలాగే రక్తపోటు కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ తాగడం వల్ల మధుమేహం, కాలేయం, రొమ్ము, పేగు క్యాన్సర్ వంటి ప్రమాదాలను బ్లాక్ కాఫీ తగ్గిస్తుంది. ఇది డోపమైన్, నోర్‌పైన్ ఫ్రైన్ అనే హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది. అలాగే ఒత్తిడి, అలసట, నీరసం కూడా విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యానికి కాఫీ మంచిదని ఎక్కువగా తీసుకోకూడదు. కేవలం మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా కాఫీ తాగితే అధికస్థాయిలో ఒత్తిడి హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి ఆందోళనకు దారితీస్తాయి. సాధారణంగా కాఫీ తాగితేనే కొందరికి నిద్రపట్టదు. అలాంటిది అధికంగా తీసుకుంటే నిద్ర విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి నిద్రపోవడానికి కొన్ని గంటల ముందు కాఫీ తాగకపోవడం బెటర్. అలాగే కడుపులో కెఫిన్ ఎక్కువగా అయిపోవడం వల్ల ఆమ్లతత్వానికి దారితీసి.. తిమ్మిర్లు, పొత్తికడుపులో నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి రోజుకి అధికంగా కాకుండా మితంగా మాత్రమే కాఫీ తాగండి. కేవలం ఉదయం సమయాల్లో మాత్రమే తీసుకోవడం అలవాటు చేసుకోండి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.