https://oktelugu.com/

Coconut Flower Benefits: రోడ్డు పక్కన ఇవి కనిపిస్తే అస్సలు వదలకండి.. ఇవి తింటే షుగర్ కంట్రోల్?

చాలా కొబ్బరి చెట్లను పెంచుతూ ఉంటారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడికెళ్లినా కొబ్బరిచెట్లు కనిపిస్తాయి. కొబ్బరి చెట్టు నుంచి వచ్చే కొబ్బరికాయలే కాకుండా ఈ చెట్టు ఆకులు, బెరడును కొన్ని ఆయుర్వేద మెడిసిన్ లో వాడుతారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 22, 2023 / 03:05 PM IST

    Coconut Flower Benefits

    Follow us on

    Coconut Flower Benefits: దేవుడికి నైవేద్యం సమర్పించడానికి కొబ్బరికాయను కొడుతాం. ఎందుకంటే కొబ్బరికాయ ఎంతో పవిత్రతను కూడుకుని ఉంటుంది. ప్రకృతి సిద్ధంగా ఇందులో నీళ్లు వస్తాయి. ఇలా వచ్చిన నీళ్లు కొబ్బరికాయను కొట్టిన తరువాత తాగడం వల్ల ఎంతో రుచిగా కూడా ఉంటాయి. అంటి పవిత్రతను కలిగిన కొబ్బరికాయను తరుచుగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పూజలు, ప్రత్యేక దినాల్లో మాత్రమే కొబ్బరికాయను తింటుంటాం. ప్రత్యేకంగా వీటిని పగలకొట్టి తినలేం. దీంతో అప్పుడడప్పుడు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు మిస్సవుతున్నాం. అయితే రోడ్డు పక్కన ఇప్పుడు కొబ్బరి పువ్వును అమ్ముతున్నారు. ఇవి తినొచ్చా? తింటే ఎలాంటి లాభాలు ఉంటాయి? అనే విషయాలు తెలుసుకుందాం.

    చాలా కొబ్బరి చెట్లను పెంచుతూ ఉంటారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడికెళ్లినా కొబ్బరిచెట్లు కనిపిస్తాయి. కొబ్బరి చెట్టు నుంచి వచ్చే కొబ్బరికాయలే కాకుండా ఈ చెట్టు ఆకులు, బెరడును కొన్ని ఆయుర్వేద మెడిసిన్ లో వాడుతారు. అయితే కొబ్బరికాయలు మార్కెట్లోకి తీచ్చిన తరువాతా కొన్నింటిలో నీరు అయిపోయి పువ్వుగా మారుతుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఇది బయటపడుతుంది. కానీ దీనిని తీసేస్తారు. అయితే ఇందులో అనేక ప్రయోజనాలున్నాయి.

    ఇటీవల కాలంలో రోడ్డు పక్కన ఇప్పుడు కొబ్బరి పువ్వులను ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు. కానీ చాలా మంది వీటిపై అవగాహన లేదు. దీంతో వీటిని తినడం వల్ల ఏమవుతుందోనన్న ఆందోలన ఉంది. అయితే కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం కొబ్బరి పువ్వును నిరభ్యంతరంగా తినొచ్చు. ఇది తినడం వల్ల ఎలాంటి నష్టాలు ఉండవు. పైగా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల అలసట తగ్గుతుంది. బరువును కూడా తగ్గించుకుంటారు.

    మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొబ్బరిపువ్వు దివ్యౌషధంలా పనిచేస్తుంది. డైట్ మెయింటేన్ చేసేవాళ్లు దీనిని కూడా చేర్చుకోవచ్చు. కొబ్బరిపువ్వు తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలోనూ ఈ పదార్థం ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండి.. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫలితంగా బరువు పెరిగే సమస్య అస్సలు ఉండదు.