Club of Bald People : సమాజంలో జుట్టును అందానికి చిహ్నంగా భావిస్తారు. జుట్టు రాలడం వల్ల చాలాసార్లు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, కానీ కొందరు దీనికి పూర్తి విరుద్ధంగా ఆలోచించి బట్టతలని స్టైల్ కు స్టేట్‌మెంట్‌గా స్వీకరిస్తున్నారు. బట్టతలని కూడా సెలబ్రేట్ చేసుకునే ప్రజలు ఉన్నారు. ఆ దేశంలో దీని కోసం ఒక ప్రత్యేక క్లబ్ కూడా ఏర్పాటు చేయబడిందంటే అక్కడి వారు బట్టతలను ఎంతగా ప్రేమిస్తారో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి క్లబ్ ఏ దేశంలో ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం.
బట్టతల ఎందుకు వస్తుంది
చాలామంది తమ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, బాగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వారి జుట్టు రాలిపోతూనే ఉంటుంది. జుట్టు రాలిపోవడానికి గల కారణాలేంటో వారికి అర్థం కాదు. జుట్టు రాలడం, బట్టతల రావడం, జుట్టు పల్చబడడం జన్యుపరమైన కారణాల వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. అయినప్పటికీ, జుట్టు రాలడం అనేది కొన్ని మందులను ఉపయోగించడం వల్ల రావచ్చు. ప్రస్తుత కలుషిత వాతావరణం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా జుట్టు రాలడం అనేది సాధారణ సమస్యగా మారింది. మహిళలు, పురుషులు, పిల్లలు అందరూ జుట్టు రాలడంతో బాధపడుతున్నారు.
ఈ దేశంలో అదో సెలబ్రేషన్
జపాన్ ప్రజల్లో బట్టతల గురించి భిన్నమైన దృక్పథం ఉంది. ఇక్కడి ప్రజలు బట్టతలని అవమానంగా చూడరు, స్టైల్ స్టేట్‌మెంట్‌గా చూస్తారు. ఈ భావజాలంతో జపాన్‌లో బట్టతల కోసం క్లబ్‌లు ఏర్పడ్డాయి. ఈ క్లబ్‌లలో ప్రజలు బట్టతల రావాడాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఒకరినొకరు ప్రేరేపించడానికి.. సమాజంలో బట్టతల గురించి సానుకూల చిత్రాన్ని రూపొందించడానికి ప్రయత్నిస్తుంటారు.
బట్టతల క్లబ్బులు ఎందుకు ఏర్పడతాయి?
బట్టతల కారణంగా చాలా మందికి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఈ క్లబ్‌లు అటువంటి వ్యక్తులకు ఒక వేదికను అందిస్తాయి. ఇక్కడ వారు తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు. ఈ క్లబ్‌లు జపనీస్ సమాజంలో బట్టతల గురించి ప్రతికూల మూస పద్ధతులను మార్చడానికి ప్రయత్నిస్తాయి. బట్టతల వల్ల ఎలాంటి నష్టం లేదని ప్రజలకు అర్థమయ్యేలా చేస్తారు. ఈ క్లబ్‌లలో ప్రజలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. బట్టతలకి సంబంధించిన సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. ఈ క్లబ్‌లలో పార్టీలు, క్రీడలు, పర్యటనలు మొదలైన అనేక రకాల సరదా కార్యకలాపాలు జరుగుతాయి. ఈ కార్యకలాపాలు వ్యక్తులు ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి.. ఆనందించడానికి అవకాశం ఇస్తాయి.
జపాన్‌లో బట్టతలకి సంబంధించి సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. చాలా మంది జపనీస్ సెలబ్రిటీలు, విజయవంతమైన వ్యక్తులు బట్టతలని గర్వంగా అంగీకరిస్తున్నారు. దీని వల్ల బట్టతల విషయంలో ప్రజల్లో సానుకూల ఆలోచన ఏర్పడుతోంది.