https://oktelugu.com/

Cholesterol: ఈ చిట్కాలతో పొట్టలోని కొవ్వును ఈజీగా కరిగించండిలా!

ఎక్కువ బరువుగా ఉండటం వల్ల పొట్టలో కొవ్వు పెరిగిపోతుంది. దీనివల్ల కొన్నిసార్లు నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అయితే పొట్టలోని కొవ్వును తగ్గించాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈజీగా చేయవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 19, 2024 / 01:20 AM IST

    cholesterol

    Follow us on

    Cholesterol: స్లిమ్‌గా, ఫిట్‌గా ఉండాలని చాలా మంది కోరుకుంటారు. కొంచెం లావుగా ఉన్నామని ఫీల్ అయ్యి.. బరువు తగ్గడానికి ప్లాన్ చేస్తుంటారు. ఈజీగా బరువు తగ్గాలని డైట్ ఫాలో కావడం, జిమ్‌కి వెళ్లడం, వాకింగ్, రన్నింగ్ వంటివి చేస్తారు. ఎన్ని నియమాలు చేసిన బరువు తగ్గరు. ఎందుకంటే ఈరోజుల్లో చాలా మంది ఫాస్ట్‌ఫుడ్స్ తినడం, పోషకాలు లేని పదార్థాలు తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతున్నారు. బయట ఎక్కడ ఏం దొరికితే అదే తినడం వల్ల అనారోగ్యమైన కొవ్వులను శరీరంలో పెంచుకుంటున్నారు. దీనివల్ల ఊబకాయం, థైరాయిడ్ వంటి ప్రమాదకరమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇంట్లో వండిన ఫుడ్ నచ్చకపోవడం వల్ల కొందరు డైలీ బయట తినడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వర్క్ బిజీ, ఇంట్లో పనుల వల్ల బయట ఫుడ్ తింటున్నారు. తినాల్సిన బయట ఫుడ్ అంతా తినేస్తున్నారు. మళ్లీ బరువు పెరిగిన తర్వాత తగ్గడానికి ప్రయత్నిస్తున్నారు. ఎక్కువ బరువుగా ఉండటం వల్ల పొట్టలో కొవ్వు పెరిగిపోతుంది. దీనివల్ల కొన్నిసార్లు నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అయితే పొట్టలోని కొవ్వును తగ్గించాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే ఈజీగా చేయవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

     

    ఆరోగ్యానికి మేలు చేసే సబ్జా గింజలతో ఈజీగా బరువు తగ్గించుకోవచ్చు. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. వీటిని డైలీ తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. సబ్జా గింజల్లోని పోషకాలు ఆరోగ్యంగా బరువు తగ్గిస్తాయి. వీటిని డైలీ తీసుకోవడం వల్ల బాడీ కూడా చలవ చేస్తుంది. అయితే రోజూ ఉదయం పూట ఈ సబ్జా గింజలను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా బరువు తగ్గుతారు. అయితే ఈ సబ్జా గింజలను చల్లని నీరు కంటే వేడి నీటిలో వేసుకుని తాగడం వల్ల ఈజీగా పొట్ట తగ్గుతుంది. ఒక గ్లాసు వేడి నీటిలో సబ్జా గింజలను వేయాలి. అందులో నిమ్మరసం, తేనె కలిపి ఒక గంట పాటు నానబెట్టాలి. ఆ తర్వాత తాగితే ఒక్క నెల రోజుల్లోనే బరువు తగ్గుతారు. ఇలా డైలీ ఉదయం పూట తాగడం వల్ల రోజంతా యాక్టివ్‌గా కూడా ఉంటారు. ఎప్పటి నుంచో బరువు తగ్గాలని, పొట్టలోని కొవ్వును తగ్గించాలని అనుకునేవారు ఈ సబ్జా గింజల వాటర్‌ను తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గుతారు.

     

    ఈ సబ్జా గింజలను చూడటానికి కొందరికి భయం వేస్తుంది. అయితే వీటిని డైరెక్ట్‌గా తాగలేని వాళ్లు ఏదైనా జ్యూస్‌ లేదా పుడ్డింగ్‌లో కూడా మిక్స్ చేసుకుని తాగవచ్చు. ఇలా తాగడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ సబ్జా గింజల వాటర్ మలబద్ధకం నుంచి కూడా విముక్తి కల్పిస్తుంది. అలాగే కారణం లేకుండా బాడీ వేడి చేయడం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు కూడా డైలీ సబ్జా గింజల వాటర్‌ను తీసుకోవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని, ఈజీగా బరువు తగ్గుతారని వీటిని అధికంగా తీసుకోవద్దు. కేవలం లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.