Chicken Food : చికెన్ తింటున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి..

ఇటీవల చేసిన కొన్ని పరిశోధనల్లో చికెన్ లో ఎక్కువగా యాంటీ బయోటిక్స్ స్థాయి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. అలాగే కొన్ని మాంసాహార పదార్థాల్లోనూ ఎంత మోతాదులో ఉన్నాయో కొందరు పరిశోధకులు వివరించారు.

Written By: Srinivas, Updated On : March 19, 2024 1:52 pm

Chicken Price Increase

Follow us on

Chicken Food :వారానికి ఒకసారైనా కొందరికి మాంసంలేనిది ముద్ద దిగదు. ఇలాంటి క్రమంలో మాంసాహారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వీటిలో కోళ్ల ఉత్పత్తి అధికంగా ఉండడంతో దీని రేటు తక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది చికెన్ కర్రీ చేసుకుంటూ ఉంటారు. చికెన్ లో ప్రోటీన్లు ఉండడంతో పాటు రుచిని ఇవ్వడం వల్ల దీనిపై ఎక్కువగా ఇంట్రెస్టు పెడుతారు. కానీ ఇటీవల చేసిన కొన్ని పరిశోధనల్లో చికెన్ లో ఎక్కువగా యాంటీ బయోటిక్స్ స్థాయి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. అలాగే కొన్ని మాంసాహార పదార్థాల్లోనూ ఎంత మోతాదులో ఉన్నాయో కొందరు పరిశోధకులు వివరించారు.

కొన్ని అధ్యయనాల ప్రకారం చికెన్ తో పాటు కొన్ని మాంసాహారంలో యాంటీ బయెటిక్స్ లెవల్ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. కోళ్ల ఆరోగ్యానికి పలు రకాల యాంటీ బయోటిక్స్ వాడుతున్నారు. ఒక్కోసారి వీటి లెవల్స్ పెంచుకుంటూ పోతున్నారు. అయితే మిగతా జంతువుల కంటే కోళ్లకే ఎక్కువగా యాంటీ బయటిక్స్ రెసిస్టెన్స్ పెరుగుతున్నట్లు సమాచారం. కోళ్లలో యాంపిసిల్లిన్ రెసిస్టెన్స్ అత్యధికంగా 33 శాతం ఉన్నట్లు తేల్చారు. అలాగే సెపోటాక్సిమ్ రెసిస్టెన్స్ 51 శాతం, టెట్రా సైక్లిన్ రెసిస్టెన్స్ 50 శాతం ఉందని కొందరు పరిశోధకులు తెలిపారు.

కోళ్ల పెంపకంలో భాగంగా ఎక్కువగా అమోక్సోక్లాప్, ఎన్రోఫ్లోక్సాసిన్ వంటి యాంటీ బయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారు. ఇవి తొందరగా ఎదిగేందుకు, బ్యాక్టీరియా దరి చేరకుండా వీటిని అందిస్తున్నారు. కోళ్లకు రోగనిరోధక శక్తి పెంచడానికి వీటిని వాడుతున్నా.. వీటిని మనుషులు తినడం వల్ల ప్రమాదమే అంటున్నారు. ఇవి ఎక్కువగా తీసుకున్న కోళ్లను తినడం వల్ల ఏకంగా యాంటీ బయోటిక్ టాబ్లెట్ వేసుకున్నట్లేనని కొందరు హెచ్చరిస్తన్నారు.

ఇక మల్టీ డ్రగ్ రెసిస్ట్రెన్స్ కోళ్లలోనే ఎక్కువగా కనిపిస్తుందని తేలింది. ఇది గొర్లలో 37 శాతం రెసిస్టెన్స్ ఉండగా.. మేకల్లో సెపొటాక్సిమ్ రెసిస్టెన్స్ 41 శాతం, అమికాసిన్ కు 35 శాతం, యాంపిసిల్లిన్ కు 26 శాతం నిరోధక పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కోళ్లలో మాత్రమే ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడగా.. ఇప్పుడు గొర్లు,మేకల్లో కూడా వీటి శాతం పెరుగుతోంది. అందువల్ల ఇవి తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.