Chicken Eat: చికెన్ లో ఈ భాగాన్ని తినడం వల్ల గుండె సమస్యలు..

చికెన్ తొడ భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీనిని ప్రైడ్ కంటే గ్రిల్ చేసి తినడం వల్ల ఫ్యాట్ ను అవైడ్ చేసిన వారవుతారు.

Written By: Srinivas, Updated On : March 9, 2024 2:17 pm

Chicken Benefits

Follow us on

Chicken Eat: శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు శాఖాహారంతో పాటు మాంసాహారం తినాలని కొందరు వైద్యులు ప్రత్యేకంగా చెబుతారు. మాంసాహారాల్లో అతి తక్కువ ధరకు లభించేది చికెన్. ఇది రుచికరంగా ఉండడంతో పాటు తినడానికి హాయిగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ మంది వీకెండ్ డేస్ లో కచ్చింగా చికెన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. చికెన్ తో కేవలం కర్రీ మాత్రమే కాకుండా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొవచ్చు. చికెన్ పకోడి, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ మంచురియా, చికెన్ బురాన్ వంటి పదార్థాలు ఎంతో రుచిని ఇస్తాయి. అయితే ఇవి కేవలం రెస్టారెంట్లు, హోటళ్లలో మాత్రమే లభిస్తాయి. అయతే కొందరు చికెన్ ను ఇష్టమొచ్చినట్లు కాకుండా ఇలా తినాలని చెబుతున్నారు.

చికెన్ తినడానికి సౌకర్యంగా ఉండడంతో పాటు రుచిగానూ ఉంటుంది. దీనిని కొందరు కేవలం కర్రీగానే తింటే..మరికొందరు మాత్రం రకరకాల పదార్థాల ద్వారా తీసుకుంటూ ఉంటారు. అయితే చికెన్ లోని కొన్ని భాగాల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని అవైడ్ చేస్తే ఎలాంటి సమస్య ఉండదని అంటున్నారు. లేకుంటే అనేక అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. శుభ్రమైన చికెన్ ను తినడం వల్ల ఎంతో లాభమో.. అపరిశుభ్రమైనది తినడం వల్ల అంతకంటే ఎక్కువగా నష్టం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చికెన్ లో ప్రధానంగా స్కిన్ లేకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. చాలా మంది చికెన్ సెంటర్లలో స్కిన్ చికెన్ తీసుకుంటూ ఉంటారు. అయితే స్కిన్ లో అనేక రకాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి. దీనిని నేరుగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ స్కిన్ అలాగే తీసుకోవడం వల్ల గుండె సమస్యలు ఎక్కువగా వస్తాయి. అలాగే చికెన్ మెడ భాగం కూడా ఎక్కువగా రానీయకుండా చూసుకోవాలి. కింది బాగం కూడా ఎక్కువగా లేకుండా చూడాలి.

ఇక చికెన్ బాడీ పీస్ తినడం వల్ల ఎంతో ఆరోగ్యమని అంటున్నారు. ఎందుకంటే ఈ పార్ట్ లో కొవ్వు లేకుండా ఉంటుంది. దీనిని తినడం బరువు ఎక్కువగా పెరగకుండా ఉంటారు. అలాగే చికెన్ తొడ భాగంలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీనిని ప్రైడ్ కంటే గ్రిల్ చేసి తినడం వల్ల ఫ్యాట్ ను అవైడ్ చేసిన వారవుతారు. అందువల్ల చికెన్ ఎప్పుడు తీసుకున్నా.. బ్రెస్ట్ విభాగం ఉండేలా చూసుకోండి. ఒకవేళ లెగ్ పీసెస్ తెచ్చుకున్నా.. గ్రిల్ చేసి తినడం వల్ల ఎలాంటి హాని చేయదు.