Chicken : కొందరు మాంసాహార ప్రియులకు ప్రతిరోజు నాన్ వెజ్ లేకుంటే అసలే ముద్ద దిగదు. అయితే మాంసాహార కృతుల్లో తక్కువ ధరకు లభించేది చికెన్ మాత్రమే. దీంతో చాలామంది చికెన్ ను ఇష్టంగా తింటూ ఉంటారు. చికెన్ తో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేయవచ్చు. చికెన్ బిర్యానీ అంటే లొట్టలు వేసుకొని తినేవారు చాలామంది ఉన్నారు. అయితే మిగతా మాంసాహారం కంటే చికెన్ లో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. కానీ ఏ సమయంలోనైనా ఇది అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మిగతా వాటికంటే చికెన్ చాలా టేస్టీగా ఉండడంతో చాలామంది దీనికే ఎక్కువగా లైక్ కొడతారు. అయితే చికెన్ తినేటప్పుడు ఈ నాలుగు పార్ట్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి తింటే ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితిలో ఏర్పడతాయి. మరి ఆ నాలుగు పార్ట్స్ ఏవో తెలుసుకుందాం..
Also Read :‘ది 100’ ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా?
చికెన్ షాపులోకి వెళ్ళినప్పుడు కళ్ళముందే కట్ చేసి ఇస్తూ ఉంటారు. అయితే చికెన్ పై అవగాహన ఉన్నవారు కొన్ని అవయవాలను పక్కన పెట్టిస్తారు. మరికొందరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఉంటారు. కానీ చికెన్ను కట్ చేసి ఇచ్చేటప్పుడు అందులో ఈ అవయవాలు లేకుండా చూడాలి. ఇవి కోడి లోనే ప్రమాదకర స్థాయిని సూచిస్తుంది. ఇక మనుషులు వాటిని తింటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అలాంటి అవయవాల్లో మెడ ఒకటి. కోడికి సంబంధించిన మెడను చాలామంది ప్రత్యేకంగా వేయించుకుంటారు. దీనిపై ఉన్న మాంసం రుచిగా ఉంటుంది. అందుకే చాలామంది దీనిని ఇష్టంగా తింటారు. అయితే కోడి తినే ఆహారంలో కొంత భాగం మెడలో ఉండిపోతుంది. ఇది వ్యర్థాలను తయారుచేస్తుంది. ఇది అలాగే ఉండిపోతే కోడిని కట్ చేసినప్పుడు కూడా అందులోనే ఉండిపోతుంది. దీనిని మనుషులు తినడం ద్వారా చిరక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పేగులో కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.
Also Read : ఆ విషయంలో ప్రభాస్ అంత ఎమోషనల్ అయ్యాడు ఏంటి..? వైరల్ వీడియో…
కోడికి సంబంధించిన వెనుక భాగాన్ని పూర్తిగా తీసివేయమని చెప్పాలి. కొందరు అందులో అలాగే వేస్తుంటారు. అయితే దీనిని తినడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కోడి వెనుక భాగంలో విష పదార్థం ఉంటుంది. సాధ్యమైనంతవరకు దీనిని లేకుండా చూసుకోవాలి.
కోడికి గుండె భాగంలో ఊపిరితిత్తులు ఉంటాయి. ఇవి కాస్త ఎరుపుగా ఉంటాయి. అయితే చాలామంది వీటిని గుర్తించరు. కానీ అనుకోకుండా చికెన్ లో ఇవి వస్తే వెంటనే తీసేయించాలి. ఎందుకంటే వీటిని తినడం వల్ల శరీరంలో పేగులో సమస్యలు ఏర్పడతాయి. దీంతో కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల ఇవి లేకుండా చూడాలి.
ఇక కొందరు స్కిన్ తో కూడిన చికెన్ తింటూ ఉంటారు. కానీ స్కిన్ పై అనేక క్రిములు దాగి ఉంటాయి. చికెను ఉడికించిన ఇవి అలాగే ఉండిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల స్కిన్ ను తీసివేసే ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే సేఫ్ గా ఉంటారు. వీటితోపాటు చికెన్ లో కొవ్వు ఉంటే అసలు తినొద్దు. ఈ కొవ్వు మనుషుల శరీరంలోకి వెళ్లి అనేక ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది.