Cheating wife: అది గుంటూరు జిల్లా తాడేపల్లి.. ఆ వ్యక్తి పేరు బ్రహ్మయ్య.. వయసు 29 సంవత్సరాలు.. ఈరోజు వరకు అతడు అందరితో కలివిడిగా ఉండేవాడు.. ఉన్నట్టుండి ఒకసారిగా నిర్వేదంలో కూరుకుపోయాడు. ఎవరితోనూ మాట్లాడకపోయేవాడు. మందలించినా సరే నిశ్శబ్దంగా ఉండేవాడు. గలగల మాట్లాడే వ్యక్తి అలా మారిపోవడం ఒక్కసారిగా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు అతడు తీసుకున్న నిర్ణయం కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది.
Also Read: వీడు భర్త కాదు కర్కోటకుడు.. రాక్షసుడిలా…
గుంటూరులోని తాడేపల్లిలో బ్రహ్మయ్య అనే యువకుడు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. కొంతకాలం క్రితం ఇతడికి ఓ యువతి తో పెళ్లి చూపులు జరిగాయి. పెళ్లి చూపులు జరిగిన మూడవ రోజే బ్రహ్మయ్య తండ్రి కన్నుమూశాడు. ఏదో అపశకునం లాగా ఉందని బ్రహ్మయ్య తల్లి అతడితో చెప్పింది. అంతేకాదు పెళ్లి చేసుకోవద్దని కూడా సూచించింది. దానికి బ్రహ్మయ్య ఒప్పుకోలేదు. పైగా ఆ అమ్మాయిని చేసుకుంటానని తల్లితో చెప్పాడు. చెప్పినట్టుగానే ఆ అమ్మాయిని చేసుకున్నాడు. వివాహం జరిగిన కొద్దిరోజులు దంపతులు సఖ్యంగానే ఉన్నారు. ఆ తర్వాతే వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీనికి తోడు బ్రహ్మయ్య సతీమణి నిత్యం ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. అతడికి అన్నం కూడా పెట్టేది కాదు. చివరికి అతనితో మాట కూడా మాట్లాడేది కాదు. దీంతో బ్రహ్మయ్య ఒక రకమైన నిర్వేదంలో కూరుకుపోయాడు. చివరికి అతడికి తెలియకూడని నిజం తెలిసింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని బ్రహ్మయ్యకు ఇటీవల తెలిసింది. దీంతో అప్పటినుంచి అతడు నిర్వేదంలో కూరుకుపోయాడు. జీవితంలో నష్టపోయానని.. పూడ్చలేని స్థాయి బాధలో మునిగిపోయానని బ్రహ్మయ్య తరచూ తన తల్లితో అనేవాడు. అంతేకాదు తన భూమి మీద బతకడం కూడా వ్యర్థమని వాపోయేవాడు. ఆమె ఊరడించే ప్రయత్నం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి తనువు చాలించాడు. అద్దె ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. బ్రహ్మయ్య ఆకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు..
Also Read: భార్య విడాకుల కేసు పెట్టింది.. ఆ ఒక్క పనితో ఆమె మనసు మార్చేశాడు..
బ్రహ్మయ్య మంగళగిరిలో తన భార్యతో నివాసం ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఓ కంపెనీలో సీసీ కెమెరా టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇతడికి వివాహం జరిగే 11 నెలల మాత్రమే అవుతోంది.. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. తన కోడలికి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని బ్రహ్మయ్య తల్లి ఆరోపిస్తోంది.. బ్రహ్మయ్యకు ఆమె తల్లి ఫోన్ చేయగా అతడు ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చి ఆమె బుధవారం బ్రహ్మయ్య నివాసం ఉంటున్న ఇంటికి వచ్చింది. తలుపు తెరిచి చూస్తే అతడు మిగతా జీవిగా కనిపించాడు. అంతేకాదు చనిపోతున్నప్పుడు అతడు సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నాడు. తన చావుకు భార్య కారణమంటూ అందులో పేర్కొన్నాడు. అతడు చెప్పిన మాటలు.. విషయాలు అందులో మొత్తం రికార్డ్ అయ్యాయి.
ఈ విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బ్రహ్మయ్య తల్లి నుంచి వివరాలు సేకరించారు..” బ్రహ్మయ్య భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. అందువల్లే అతడిని దూరంపెట్టేది. అతడితో గొడవపడేది. దీంతో అతడు తట్టుకోలేక ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడు. ఆమెతో పెళ్లి చూపులు జరిగిన మూడవ రోజే నా భర్త చనిపోయాడు. అప్పట్నుంచి ఏదో కీడు జరుగుతుందని నాకు అనిపించింది. అనుకున్నట్టుగానే ఇలా జరిగింది. నా కన్న కొడుకు తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. దీనంతటికీ కారణం నా కోడలు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని” బ్రహ్మయ్య తల్లి పోలీసులను వేడుకున్నది. అంతేకాదు కొడుకు మృతదేహం మీద ఆమె పడి రోదించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది.