Chanakyaniti: ఈ లోకంలో ప్రేమకు ఎంత ప్రాధాన్యత ఉందో.. స్నేహానికి అంతే ప్రాముఖ్యత ఉంది. ఇక స్నేహం, ప్రేమ ఏవైనా ముందు బాగున్నా.. కొన్ని రోజుల తర్వాత అసలు రంగులు బయటపడుతుంటాయి. అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. మరి వారు ఎలాంటి వారు? ఎవరిని నమ్మాలి అనే విషయాలు ఎలా తెసుకోవాలో.. ఎవరితో స్నేహం చేయాలో చాణక్యుడు తెలిపిన కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
త్యాగం.. త్యాగం చేసే గుణం ఉన్న వ్యక్తిని నమ్మవచ్చని.. అతను ఎవరికోసం అయినా త్యాగం చేయడానికి వెనకాడడు అంటే మీకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సాయం చేస్తాడు. మీకోసం త్యాగా చేస్తాడు అని వివరించారు చాణక్యుడు. ఇతరుల సంతోషాన్ని పట్టించుకునే వ్యక్తులను గుడ్డిగా నమ్మవచ్చట.
మంచి స్వభావం మస్ట్..
మంచి లక్షణాలు ఉన్న వ్యక్తిని మాత్రమే నమ్మాలి. మీ స్నేహంలో వారు మంచి స్వభావం గల వ్యక్తులను మీరు విశ్వసిస్తే వారితో స్నేహం చేయవచ్చని తెలిపారు చాణక్యుడు. అయితే చెడు స్వభావం గల వ్యక్తులు తమ స్వలాభం కోసం ఇతరులకు హానీ చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీతో ఉంటూనే మీకు వెన్నుపోటు పొడుస్తారు.
ఈ చెడు లక్షణాలు ఉన్నాయా?
కోపం, సోమరితనం, స్వార్థం, అబద్ధం, గర్వం వంటి చెడు లక్షణాలు ఉన్న వ్యక్తిని ఎక్కువగా నమ్మవద్దని తెలిపారు చాణక్యుడు. నిజం మాట్లాడేవారు, సత్యానికి మద్దతు ఇచ్చేవారిని విశ్వసించవచ్చట. మీ వైపు తప్పులు ఉంటే కూడా నేరుగా చెబుతారు. అది మీ అభివృద్దికి ఉపయోగపడుతుంది. ఇలాంటి వారిని దూరం చేసుకోవద్దు కూడా.
మంచి పనులు చేసేవారికి, చెడ్డ పనులు చేసేవారిని రెండు రకాలుగా గుర్తుపట్టవచ్చు. మంచి పనులు చేసేవారికి అత్యశ, అబద్ధం వంటి లక్షణాలు ఉండవు. చెడ్డ పనులు చేసేవారికి అత్యాశ, అబద్ధం, ఇతరులపై ఏడుపు వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
కష్టాల్లో సాయం చేయాలి..
అవసరమైన సమయంలో సహాయం చేసేవాడే మంచి స్నేహితుడు. మీ జీవితంలో ఏదైనా తప్పు జరిగినా, ఆటంకాలు ఎదురైనా మంచి స్నేహితుడు మీకు మద్దతు ఇచ్చి.. సహాయం చేస్తాడు. మీకోసం పోరాడుతాడు. మరి చూశారుగా చాణక్యుడు చెప్పిన విషయాలు.. ఇలాంటి లక్షణాలు ఉన్న స్నేహితులు మీకు ఉంటే వారిని నమ్మండి. ఇక చెడు లక్షణాలు ఉన్న స్నేహితులు ఉంటే వారిని దూరం పెట్టండి.