https://oktelugu.com/

Chanakyanithi: చాణక్యనీతి : భార్య ఈ తప్పులు చేసినా.. క్షమించాలి..ఎందుకంటే?

అపరచాణక్యుడు మనుషుల జీవితానికి సంబంధించి అనేక విలువైన సూత్రాలు చెప్పాడు. ముఖ్యంగా పెళ్లయిన తరువాత దంపతులు ఎలా జీవించాలి? వారి మధ్య జరిగే పరిస్థితుల గురించి క్షుణ్ణంగా వివరించాడు. వీటిని పాటిస్తూ కొందరు తమ దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 8, 2024 / 11:14 AM IST

    chanakya-niti

    Follow us on

    Chanakyanithi: అపరచాణక్యుడు మనుషుల జీవితానికి సంబంధించి అనేక విలువైన సూత్రాలు చెప్పాడు. ముఖ్యంగా పెళ్లయిన తరువాత దంపతులు ఎలా జీవించాలి? వారి మధ్య జరిగే పరిస్థితుల గురించి క్షుణ్ణంగా వివరించాడు. వీటిని పాటిస్తూ కొందరు తమ దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసుకుంటున్నారు. అయితే భారభార్తల్లో ఎవరో ఒకరు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇవి యాదృచ్చికంగా కావొచ్చు..లేదా కావాలని చేయేచ్చు. దంపతుల్లో భార్య చేసే కొన్ని తప్పులను భర్త క్షమించాలని చాణక్యుడు చెప్పారు. ఇలా క్షమించడం వల్ల ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుందని అంటున్నారు. అలా కాకుండా ఉంటే ఇద్దరి మధ్య దూరం పెరిగి.. చివరికి విడిపోయే స్థితికి వస్తుంది. అందువల్ల కొన్ని తప్పులను క్షమించాలని అంటున్నారు. మరి భార్య చేసే ఏ తప్పులను క్షమించాలి?

    కుటుంబం అంటే భార్యతో పాలు పిల్లలు కూడా ఉంటారు. ఇంట్లో పిల్లలు తెలియక తప్పు చేస్తుంటారు. వారిని చక్కదిద్దే ప్రయత్నం తల్లిదండ్రులు చేయాలి. ఈ క్రమంలో ఒక్కోసారి భార్య పిల్లలపై చేయి చేసుకునే అవసరం కూడ పడుతుంది. దీంతో భార్య పిల్లలను కొట్టడం ద్వారా భార్యపై తిరగబడకూడదు. ఇలా చేయడం వల్ల పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాకుండా భార్య కూడా నిరాశ చెందుతుంది. అయితే ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. ఎందుకంటే పిల్లల మంచి కోసమే తల్లి కొట్టడానికి రెడీ అవుతుంది.

    ప్రస్తుత కాలంలో ఎవరి జీవితమైనా డబ్బుతోనే ముందుకు వెళ్తుంది. డబ్బు ఎవరికైనా ఏ విధంగానైనా అవసరం ఉంటుంది. భార్యకు కూడా ఇంట్లో అవసరాలకు డబ్బు అవసరం ఉంటుంది. ఈ క్రమంలో భర్త జేబులో నుంచి డబ్బు తీస్తుంది. అయితే ఈ విషయాన్ని భర్తకు చెప్పపోయి.. ఆ తరువాత తెలవడం వల్ల కోప్పడకూడదు. ఎందుకంటే ఇంట్లో అవసరాల కోసమే భార్య డబ్బు వాడుకుంటుంది. అయితే ఎందుకోసం తీశారో తెలుసుకుంటే సరిపోతుంది.

    ఇంట్లో కొన్ని పనులు అనుకున్న సమయానికి కావు. ఈ విషయంలో కొందరు ఆడవాళ్లు ప్రయత్నించినా సాధ్యం కాదు. దీంతో భర్త వారిని అర్థం చేసుకోవాలి. అవసరమైతే వారికి సాయం చేయాలిన అంతేగానీ.. వారిపై కోపం తెచ్చుకోవడం వల్ల మరోసారి ఇలాంటి పనులు చేయడాకిని ముందుకు రారు. ఇలా పదే పదే కోపం తెచ్చుకోవడం వల్ల వారు తీవ్ర నిరాశ చెందుతారు. దీంతో దంపతులిద్దరి మధ్య వ్యత్యాసం ఏర్పడుతుంది. ఆ తరువాత అనేక సమస్యలు ఎదుర్కొంటారు.

    అన్ని సమయాలు ఒకేలా ఉండవు. అంతేకాకుండా ఎప్పటికీ లాభం జరుగుతుందని అనుకోలేం.ఒక్కోసారి భార్య చేష్టల వల్ల నష్టం కలగవచ్చు. అంతమాత్రాన కోపం తెచ్చుకోవడం సరికాదు. కొన్ని విషయాల్లో నష్టం జరిగినా భార్య తప్పులను క్షమించడం ద్వారా భర్తపై నమ్మకం కలుగుతుంది. అంతేకాకుండా మరోసారి నష్టం కాకుండా తనేచూసుకుంటుంది. అందువల్ల ఒక్కోసారి వారి విషయంలో మృదుస్వభావంతో మెలగాలి.

    భర్తతో పాటు భార్య కూడా ఇంట్లో పనులు సమానంగా చేస్తుంది. దీంతో వారికి ఒక్కోసారి కోపం రావొచ్చు. దీంతో వారిపై తిరగబడకుండా ప్రశాంతంగా వారికి జరిగిన అన్యాయమేంటో తెలుసుకోవాలి. ఇలా ఒకరి బాధలను మరొకరు అర్థం చేసుకోవడం ద్వారా వీరి జీవితం సుఖవంతంగా ఉంటుంది.