Acharya Chanakya : ప్రతి ఒక్కరూ విజయం సాధించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. వాళ్లు సమాజంలో గౌరవ మర్యాదలు పెరగాలని కోరుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు జీవితంలో విజయం సాధించాలి అంటే ముందుగా మనకు సెల్ఫ్ కంట్రోల్ అనేది తప్పనిసరిగా ఉండాలి. నీతి శాస్త్రంలో ఆచార్య చాణుక్యుడు తెలిపిన కొన్ని సూత్రాలను తెలుసుకోవడం వలన జీవితంలో విజయం ఎలా సొంతం అవుతుందో తెలుసుకోవచ్చు. ఆచార్య చాణిక్యుడు గొప్ప వ్యూహ కర్తతో పాటు గొప్ప రాజకీయవేత్త కూడా. ఒక మనిషి జీవితంలో గొప్పగా ఎలా జీవించాలి అనే దాని గురించి అనేక నియమాలను ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రంలో వివరించారు. మనిషి విజయానికి సంబంధించి ఈయన తెలిపిన నియమాలను ఇప్పటికీ కూడా చాలామంది అనుసరిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన సందర్భాలలో మౌనం పాటించడం వలన కూడా విజయం మన సొంతం అవుతుంది అని ఆచార్య చానిక్యుడు తెలిపాడు. తెలివైన మనుషులు చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్లు ఎక్కువగా ఎదుటి వాళ్ళు చెప్పిన మాటలను వింటారు. మనిషికి ఉండే గొప్ప కలలలో మౌనం కూడా ఒకటి. కొన్ని సందర్భాలలో మాట్లాడడం వలన కూడా అనేక నష్టాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి సందర్భాలలో మౌనం పాటించాలి. ముఖ్యంగా మనిషి జీవితంలో కొన్ని ముఖ్యమైన సందర్భాలలో మాట్లాడడం కంటే మౌనం పాటించడం వలన కొన్ని నష్టాలు సంభవించకుండా ఆపవచ్చు.
Also Read : చాణక్యనీతి: జీవితంలో ఆనందం నిండాలంటే ఇలా చేయండి..
ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో ఆ గొడవతో మీకు సంబంధం లేకపోతే మీరు ఆ గొడవలో మధ్యలో జోక్యం చేసుకోకూడదు. ఈ విధంగా జోక్యం చేసుకుంటే మీకే సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే కొంతమంది వ్యక్తులు తమ గొప్పతనం గురించి చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి సమయంలో కూడా మీరు మౌనం పాటించడం చాలా మంచిది. ఒకవేళ ఎదుటి వ్యక్తి గొప్పలు చెప్పుకుంటున్న సమయంలో మీరు వాళ్ళ మాటలకు భంగం కలిగిస్తే వాళ్ల మాటలను మీరు మధ్యలో ఖండించినట్లు అవుతుంది.
వాళ్ల గొప్పతనానికి మీరు జలసీగా ఫీల్ అవుతున్నారు అని వాళ్ళు అనుకుంటారు. అలాగే మీ మీద ఎవరికైనా కోపం వస్తే వాళ్ల కోపాన్ని కూడా మీరు మౌనంగా భరించాలి. ఈ విధంగా మీరు ఎదుటి వాళ్ళకి కోపం వచ్చిన సమయంలో మౌనంగా ఉన్నట్లయితే మీ మీద ఉన్న కోపం తగ్గుతుంది. అలాగే ఒక విషయం గురించి చర్చ జరుగుతూ ఉంటే ఆ విషయం గురించి మీకు పూర్తిగా అవగాహన లేకపోతే మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే మంచిది.