Chanakya Niti: ఆచార్య చాణక్యుడు రాజనీతి శాస్త్రంలో స్త్రీల పాత్రపై ఎన్నో విషయాలు చెప్పాడు. సంసారం సజావుగా సాగాలన్నా గొడవలతో కకావికలం కావాలన్నా ఆడదాని పాత్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. కుటుంబ సభ్యులను చూసుకోవడంలో కూడా స్త్రీలదే ప్రధాన భాగమని తెలుస్తోంది. దీంతో కుటుంబంలోని లోపాలను సరిదిద్దడంలో కూడా మహిళల అలవాట్లే పట్టి పీడిస్తాయనడంలో సందేహం లేద

స్త్రీల వల్లనే కుటుంబం ఉన్నతంగా ఎదుగుతుంది. అదే సమయంలో మహిళ సరిగా నడుచుకోకుంటే పాతాళానికి పడిపోవడం ఖాయం. కుటుంబాల్లో అపార్థాలు తీసుకురావడంలో కూడా వారిదే ముఖ్య పాత్ర అవుతుంది. మహిళలకు ఉండే చెడు అలవాట్లతో చెడు పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. తన కోపమే తన శత్రువు అంటారు. కోపం మనిషికి మంచిది కాదని తెలిసినా దాన్ని దూరం పెట్టడం సాధ్యం కాదు. మనిషి విచక్షణ కోల్పోయినప్పుడు సహజంగా కోపం రావడం తెలిసిందే.
నిగ్రహం కోల్పోతే ఆగ్రహం కచ్చితంగా వస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే అనర్థాలే కలుగుతాయి. అబద్దాలు చెప్పే అలవాటు స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. అబద్దాలు చెప్పడం వల్ల ఎన్నో అనర్థాలు వస్తాయి. నిజం తెలిసినప్పుడు అనేక సమస్యలు చుట్టుముడతాయి. స్త్రీలతోపాటు పురుషులు కూడా అబద్దం చెప్పే అలవాటును తగ్గించుకుంటే మంచిది. సంసారం సాఫీగా సాగాలంటే అబద్దాలు చెప్పడం మానేయాలి. అందుకు అనుగుణంగా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోవచ్చు.

పై అలవాట్లను దూరం చేసుకుంటేనే ప్రయోజనం. ఆచార్య చాణక్యుడు ఏనాడో మనిషిలో ఉండే చెడు లక్షణాల గురించి చెప్పాడు. వాటికి దూరంగా జరిగి జీవితాన్ని బాగు చేసుకోవాలని సూచించాడు. ఆడవాళ్లు తమ చెడు అలవాట్లను దూరం చేసుకుని సంసారాన్ని సక్రమంగా సాగేలా చేసుకోవాలని చెబుతున్నాడు. ఆచార్య చాణక్యుడు కుటుంబ సంబంధాలపై ఆనాడే ఊహించి ఎన్నో విషయాలు చెప్పాడు. ప్రస్తుతం ఆ విషయాలే మనకు పనికి వస్తున్నాయి. మనిషి ఎదిగేందుకు ఎన్నో మంచి విషయాలు చెప్పి మానవుల సమస్యలు దూరం చేసే ప్రయత్నం చేయడం గమనార్హం.

