Chanakya Niti: ఇంటిల్లి పాదిని చక్కగా చూసుకుంటూ.. ఇంట్లో పనులు చకచకా చేస్తూ.. ఎవరికి ఏ కష్టం రాకుండా చూసుకునే వ్యక్తే భార్య. ఎలాంటి పనులు అయినా ఇట్టే చేసేస్తుంటుంది ఆ ఉత్తమరాలు. కానీ అందరు ఇలాగే ఉండరండోయ్.. భర్తలను ఇబ్బంది పెట్టి సంసారాలను నాశనం చేసుకునే కంచు భార్యలు కూడా తయారయ్యారు. మరి భార్యకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? ఎలాంటి స్త్రీని ఉత్తమ భార్యగా పరిగణించవచ్చు అనే వివరాలు చాణక్యుడు తెలిపారు. మరి ఓ సారి మీరు తెలుసుకోండి..
తొందరపాటు నిర్ణయాలు.. కుటుంబాన్ని నడిపించే ప్రధాన బాధ్యత భార్యదే కాబట్టి.. ఆమెకు ఓపిక చాలా అవసరం. తొందర పాటు నిర్ణయాలు తీసుకునే స్త్రీని పెళ్లి చేసుకోవద్దు అంటారు చాణక్యుడు. ఓపికతో ఉండే వ్యక్తి అత్యున్నత స్థాయిలో రాణిస్తారట. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ జీవితం నాశనం చేసే అమ్మాయిని కాకుండా ఓపిక గల స్త్రీని పెళ్లి భార్యగా తెచ్చుకోండి.
ప్రశాంతత.. ప్రశాంతంగా ఉండే స్త్రీ వల్ల ఆమెకే కాదు మీ ఇంటికి కూడా అందమే. స్త్రీకి ఎప్పుడు కోపం పనికిరాదు. అలా ఉంటే కుటుంబానికి చేటే. అందుకే కూల్ గా ఉండే అమ్మాయిని చూస్ చేసుకోండి. ఇలాంటి భార్య వస్తే భర్త కూడా హ్యాపీగా ఉంటాడు అని తెలిపారు చాణక్యుడు.
గౌరవం.. ప్రతి ఒక్కరిని గౌరవించే అమ్మాయి మిమ్మల్ని గౌరవిస్తుంది. మీ ఇంటికి గౌరవ సూచికగా నిలుస్తుంది. ఇలాంటి అమ్మాయిలు ఇంట్లో గొడవలకు తావు ఇవ్వదు. వీరికి పెద్దవారి నుంచి చిన్నవారి వరకు ఎలా సంతోషంగా చూసుకోవాలో తెలుసు. అందుకే గౌరవానికి ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయిని ఎంచుకోండి.
పూజలు.. ఆధ్యాత్మికత ఎక్కువగా ఉండే స్త్రీ ఇంటి ఆనందానికి ప్రతీక. ఈమెకు భర్త జీవితాన్ని మార్చే శక్తి ఉంటుది. ఇలాంటి వారు కుటుంబాన్ని చెడు నుంచి కాపాడేలా అడుగులు వేస్తారు. కుటుంబం బాగుండాలి అని పూజలు చేసే భార్య రావడం భర్త అదృష్టం అని తెలియజేశారు చాణక్యుడు.
నిర్ణయాలు.. ఒక కుటుంబాన్ని ఎలాంటి పరిస్థితుల నుంచి అయినా బయటపడేసే శక్తి ఉంటుంది స్త్రీకి. అందుకే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరైనా నిర్ణయాలు తీసుకునే స్త్రీ ఉండడం అదృష్టం. ఆమె తీసుకునే ధైర్యంతో కూడిన నిర్ణయం మీ ఇంటిని కాపాడుతుంది అన్నారు చాణక్యుడు.