https://oktelugu.com/

Chanakya Niti: ఇలాంటి వారు మీ జీవితంలో ఉంటే దూరం పెట్టండి..

Chanakya Niti: మూర్ఖులకు జ్ఞానం ఇవ్వకూడదని తెలిపారు చాణక్యుడు. మూర్ఖుడైన శిష్యుడికి నేర్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదట. అతను చేయాలనుకున్నదే చేస్తాడు. అలాంటి వారు ఎవరి మాట వినరు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : January 19, 2024 6:02 pm
    Chanakya-Niti
    Follow us on

    Chanakya Niti: భారతీయ జ్ఞాన సంప్రదాయంలో గొప్ప స్థానం ఉన్న వారు ఆచార్య చాణక్యుడు. ఈయన గొప్ప సలహాదారు మాత్రమే కాదు. వ్యూహకర్త, తత్వవేత్త అలాగే వేదాలు, పురాణాల గురించి పూర్తిగా తెలిసిన మహానీయుడుగా మంచి ముద్ర వేసుకున్నారు. ఈ జ్ఞానం ఆధారంగానే అతను మానవ జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలిపారు. చాణక్య నీతిలోని ఒక శ్లోకం ద్వారా 4 రకాల వ్యక్తులను ఆదుకునే వారికి ఎప్పుడు కష్టాలే వస్తాయట. మరి ఆదుకున్నా కూడా కష్టాలు కొని తెచ్చే ఆ నాలుగు రకాల మనుషులు ఎవరో తెలుసుకుందాం..

    మూర్ఖులకు జ్ఞానం ఇవ్వకూడదని తెలిపారు చాణక్యుడు. మూర్ఖుడైన శిష్యుడికి నేర్పించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదట. అతను చేయాలనుకున్నదే చేస్తాడు. అలాంటి వారు ఎవరి మాట వినరు. ఇలాంటి వారికి ఏ విధమైన జ్ఞానం అందించినా కూడా వ్యర్థమే అవుతుంది కానీ ఎలాంటి లాభం ఉండదు. అలాంటి వారిని ఎప్పుడూ కష్టాలే చుట్టుముడుతాయి కూడా.

    కుటుంబం గురించి ఆలోచించని మహిళలకు కూడా దూరంగా ఉండాలన్నారు చాణక్యుడు. తమ కుటుంబాన్ని వెంట తీసుకొని వెళ్లడానికి ఆలోచించేవారిని, భర్త, పిల్లల, తల్లిదండ్రుల గురించి ఆలోచించని వారి గురించి పట్టించుకోవద్దట. అలాంటి స్త్రీలను ఆదుకోవడం వల్ల హాని కలుగుతుందని తెలిపారు చాణక్యుడు.

    డబ్బు గురించి మాత్రమే ఆలోచించే వారికి, ధనం వినాశనం చెందిస్తున్న వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వారు అవసరమైన పనికి కూడా మనకోసం ఖర్చు చేయరు. ఖర్చు చేయాల్సి వస్తే మిమ్మల్ని వదిలేస్తారు కానీ ఖర్చు చేయరు. అంతేకాదు వారు డబ్బును సరిగ్గా ఉపయోగించుకోలేరు కూడా.

    ఎప్పుడు విచారంగా ఉండే వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలట. వీరితో మాట్లాడిన ప్రతి సారి సమస్యల చిట్టా విప్పుతుంటారు. అంటే వీరి వద్ద ఎల్లప్పుడు సాడ్, దు:ఖం తప్ప నవ్వుకు, సంతోషానికి ఆస్కారం ఉండదు. అలాంటప్పుడు మనం కూడా వారితో ప్రతిసారి బాధ పడుతూనే ఉండాలి. అందుకే వీరికి కూడా దూరంగా ఉండడం మంచిది.