Chanakya Niti: ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాల ప్రకారం మనిషి ఎలా జీవించాలో చాలా సందర్భాల్లో చెప్పాడు. ఎలా మసలుకోవాలో ఆనాడే సూచించాడు. ఈ క్రమంలో ప్రతి స్త్రీ తన జీవితంలో కాబోయే జీవిత భాగస్వామి విషయంలో మహిళలు ఎలాంటి అభిప్రాయాలు కలిగి ఉంటారో తెలియజేశాడు. స్త్రీ తనకు కాబోయే వాడు ఎలాంటి వాడు కావాలో అనే దానిపై పలు కోణాల్లో ఆలోచిస్తుంటుంది. జీవిత భాగస్వామి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటారు. చాణక్యుడు సూచించిన విషయాలు ఇప్పటికి మనకు గుర్తుండే ఉంటాయి. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే క్రమంలో ఉత్తమ గుణాలున్న వారిని కోరుకుంటారు.

ఏ స్త్రీ అయినా ప్రశాంతంగా ఉండే మగవాడిని ఇష్టపడుతుంది. ఎంత తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేసే వాడిని కోరుకుంటుంది. ఇలాంటి వారి పట్ల మహిళలు మక్కువ చూపుతారని తెలుస్తోంది. ప్రశాంతమైన స్వభావం గల వాడి కోసం ఎంత కాలమైనా ఆగుతుంది. అలాంటి వాడి కోసం ఆకర్షితురాలవుతుంది. జీవిత భాగస్వామి అందంగా కనిపించాలని కోరుకుంటుంది. పురుషుల వ్యక్తిత్వంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఒక వ్యక్తి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్న వారిని స్త్రీలు మంచివారిగా పరిగణిస్తారు.
స్త్రీలు అత్యాశ, అహంకారం ఉన్న వారిని అసలు ఇష్టపడరు. ఇలాంటి వారిని స్త్రీలు దూరంగా ఉంచుతారు. నిజాయితీ, నిబద్ధత, విదేయులుగా ఉండే వారిని మహిళలు కోరుకుంటారనడంలో అతిశయోక్తి లేదు. చాణక్యుడి సూచనల ప్రకారం జీవిత భాగస్వామిని ఎన్నుకునే క్రమంలో మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉండటంతో మంచి వ్యక్తిత్వం కలిగిన వారిని ఎన్నుకునేందుకు నిర్ణయించుకుంటారు. పురుషులతో పాటు స్త్రీలకు కూడా జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో ఇష్టాఇష్టాలుంటాయి.

చాణక్య నీతి ప్రకారం మహిళలు నీచంగా ప్రవర్తించే పురుషుల పట్ల ద్వేషం కలిగి ఉంటారు. అలాంటి పురుషులకు మహిళలు దూరంగా ఉంటారనడంలో సందేహం లేదు. ఇతరులకు సహాయం చేసే గుణం ఉండాలని భావిస్తారు. దీంతో స్త్రీలు తమకు కాబోయే వారి కోసం ఎదురుచూస్తారు. మంచి సుగుణాలున్న వారిని తమ జీవిత భాగస్వామిగా చేసుకోవడంలో ఆలోచనలు చేస్తారని తెలిసిందే. ఇద్దరు కూడా మంచి వారిని ఎంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారని చాణక్యుడు ఆనాడే చెప్పాడు.