Chanakya Niti: ఆచార చాణక్యుడు ఎన్నో విషయాలు నేర్పించాడు. రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం ద్వారా మనుషులకు కలిగే ఇబ్బందులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూనే వాటికి పరిష్కారాలు చూపాడు. తక్షశిల విశ్వవిద్యాలయంలో బోధకుడిగా చాణక్యుడు చూపిన తెగువ అనన్యమైనది. కౌటిల్యుడుగా కూడా అతడికి పేరు ఉండటం గమనార్హం. మౌర్య సామ్రాజ్యంలో చంద్రగుప్తుని ఆస్థానంలో ప్రధానమంత్రిగా పనిచేసిన చాణక్యుడి ఉపాయాలు ఎన్నో మార్గాలకు దారి చూపాయి. తన నీతి వాక్యాలు ఎంతో మందికి భవిష్యత్ ను చూపించాయి. అంతటి ప్రతిభావంతుడైన చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు విశదీకరించాడు. ఫలితంగా ఎన్నో చిక్కుముడులు విప్పాడు.

నోరు మంచిదైతే ఊరుమంచిదవుతుందని సామెత. మనం మాట్లాడే మాటలే మనకు మిత్రుతలను, శత్రువులను తయారు చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. కొందరుంటారు నోరు తెరిస్తే బూతులే వస్తాయి. దీంతో వారు నలుగురిలో ఎక్కువ సేపు మాట్లాడలేరు. మరికొందరు ఉంటారు వారు చాలా సరళమైన భాషను ప్రయోగిస్తారు. దీంతో వారి నోటి నుంచి మంచిమాటలే వస్తాయి. దీంతో వారికి ఎలాంటి చిక్కులు, ఆపదలు రావు. ఎందుకంటే వారు మాట్లాడే మాటలే వారికి స్నేహితులను తయారు చేస్తాయి.
Also Read: Vastu Shatra: వాస్తు శాస్త్రంలో ఉత్తర దిక్కు ప్రయోజనమేమిటో తెలుసా?
ఆచార్య చాణక్యుడు మన జీవితంలో ఇద్దరిని మాత్రం ఎప్పుడు కూడా దూషించరాదు. అసభ్య పదజాలంతో సంబోధించరాదని సూచించాడు. వారు ఎవరో కాదు తల్లిదండ్రులే. మనల్ని కన్న వారు కావడంతో వారి పట్ల మనం ప్రేమ చూపించాలి. వాత్సల్యం ప్రదర్శించాలి. అంతే కాని ఎప్పుడు కూడా వారిని తిట్ట కూడదు. చెడు మాటలు అనకూడదు. ఒకవేళ మనం వారిని తిడితే ఆ పాపం మనకే తగులుతుంది. తల్లిదండ్రులను దూషిస్తే ఎక్కడ లేని పాపం మూటగట్టుకున్నవాళ్లమవుతాం. అందుకే వారిని బాగా చూసుకుంటేనే మన ముందు తరాల వారు కూడా అలాగే మనల్ని చూసుకుంటారని తెలుసుకోవాలి.

మనం ఏదో సందర్భంలో వారిని టార్గెట్ చేసుకుని నిందించడం సరికాదు. వారిని ఎప్పుడు ఎలాంటి మాటలు అనకుండా జాగ్రత్తగా చూసుకుంటేనే మనకు మంచి ఫలితం ఉంటుంది. అంతేకాని ఎప్పుడు సూటిపోటి మాటలతో తల్లిదండ్రులను అవహేళన చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందుకే కన్నవారి రుణం తీర్చుకోవడానికి ప్రయత్నించాలి కానీ వారిని ఎడాపెడా తిడితే మనకే పాపభీతి పడుతుంది. తద్వారా భవిష్యత్ లో ఎన్నో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయని హెచ్చరించాడు. కన్నవారిని కళ్లల్లో పెట్టుకుని చూస్తేనే మనకు మంచి జరుగుతుందని చాణక్యుడు తెలియజేశాడు.
Also Read:India vs Pakistan Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. గెలుపు ఎవరిదంటే