Chanakya Niti: భార్య భర్తల బంధం చాలా గొప్పది. పెళ్లి అనే బంధంతో జీవితాంతం ఒకరికి తోడుగా ఒకరు తోడుంటారు. అంతే కాదు కష్టనష్టాలను పంచుకుంటూ ఇద్దరు కూడా జీవితాన్ని సాగిస్తుంటారు. కానీ ప్రస్తుతం ఈ బంధానికి ఎక్కువ విలువ ఇవ్వకుండా చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారు చాలా మంది. అయితే ఈ బంధం బలంగా ఉండాలంటే ఇద్దరు కూడా సన్మార్గంలో నడవాలి. మరి మంచి భార్యకు ఉండాల్సిన లక్షణాల గురించి చూశాం. ప్రస్తుతం ఇద్దరి మధ్య ఉండాల్సిన మంచి లక్షణాల గురించి ఆచార్య చాణక్యుడు ఏం చెప్పారో తెలుసుకుందాం.
1.. ప్రేమ.. భార్యాభర్తల మధ్య సంబంధం బలంగా ఉండాలంటే కచ్చితంగా వారి మధ్య ప్రేమ ఉండాలన్నారు. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పుడే వారు చిరకాలం కలిసి మెలిసి సంతోషంగా ఉంటారన్నారు. దంపతుల మధ్య ఎప్పుడైతే ప్రేమ క్షీణిస్తుందో అప్పుడు ఆ బంధం కూడా బలహీనపడుతుంది అన్నారు చాణక్యుడు.
2.. గౌరవం.. ఒకరిపై ఒకరికి ఎప్పుడు గౌరవం ఉండాలి. అలా లేని బంధం చులకనైపోతుంటుంది. బలహీనపడుతుంటుంది. గొడవలకు కారణం అవుతుంది. అందుకే ఒకరిని ఒకరు ప్రేమతో గౌరవించుకోవాలి అన్నారు చాణక్యుడు.
3.. అంకిత భావం.. భార్యభర్తల మధ్య సంబంధాన్ని బట్టి వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. భాగస్వాములిద్దరికి కుటుంబంపై బాధ్యత, అంకింత భావం ఉండాలి. రిలేషన్ షిప్ లో డెడికేషన్ సెన్స్ లేకపోతే ఆ రిలేషన్ షిప్ ఎక్కువ కాలం నిలవదట. ఈ అంకిత భావం ఒకిరికి ఒకరు సహాయం చేసుకోవడానికి ప్రేరేపిస్తుంది. అందుకే వీరిని ఎవరు విడదీయలేరు.
4.. నిస్వార్థం.. భార్యభర్తల మధ్య స్వార్థం అసలు ఉండకూడదు. దీని వల్ల ఎలాంటి బంధమైన బలహీనపడుతుంది. వారు కలిసి సంతోషంగా ఉండలేరు. అందుకే భార్య భర్తల మధ్య స్వార్థం ఉండకూడదు అన్నారు చాణక్యుడు.