Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు చెప్పాడు. జీవితంలో ఎదగాలంటే మనిషికి ఏం కావాలో వివరించాడు. అవసరమైన సమయాల్లో ఎలా ఉండాలో సూచించాడు. మనిషి తన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు. వాటిని తన తెలివితో ఎలా పరిష్కరించుకోవాలో తెలియజేశాడు. తన రచనలతో మనిషికి ముందు చూపు ఎలా ఉండాలో చాటిచెప్పాడు. ఎవరైనా జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని అంశాలు లెక్కలోకి తీసుకోవాలి.

మనిషి తన జీవన మనుగడలో పశ్చాత్తాపం గురించి బాధపడితే ముందకు వెళ్లలేడు. మనం తీసుకున్న నిర్ణయాలతో ఎక్కడో ఓ చోట చేదు ఫలితం ఎదురైతే దాన్ని తలుచుకుని బాధపడేకంటే భవిష్యత్ లో మనం చేపట్టే పనులను గురించి ఆలోచించుకోవాలి. గతం గురించి ఆలోచిస్తే ముందుకు సాగడం వీలు కాదు. గతంలో చేసిన తప్పులను తలుచుకుని బాధపడితే లాభం ఉండదు. మానసిక ప్రశాంతత దూరం అవుతుంది. దానికి బదులు చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు కదలడమే మన ముందున్న కర్తవ్యమని గుర్తించాలి.
ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించకూడదు. ఆగాన వచ్చింది భోగాన పోతుందని చెబుతుంటారు. ఎప్పుడు కూడా తప్పుడు దారుల్లో డబ్బు సంపాదిస్తే దాని వల్ల ఎప్పుడు నష్టాలే ఎదురవుతాయి. తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదిస్తే అది ఎప్పటికైనా మనకు చేటు తేవడం ఖాయం. అందుకే తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదన ఎప్పుడు బాధలే తెస్తుంది. అక్రమ మార్గాల్లో వచ్చే డబ్బుతో ఎన్నో అనర్థాలు వస్తాయి. తప్పుడు మార్గాల్లో వచ్చే సంపాదనకు ఆశించడం ముప్పే.
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మూడు విషయాలు ఆలోచించాలి. నేనేం చేయాలి? ఫలితం ఎలా ఉంటుంది? దాని విలువ ఎంత? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుంది. ఏదైనా చేసే ముందు ఆలోచించిన తరువాతే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటే ఫలితం బాగుంటుంది. అది మన జీవితంపై ప్రభావం చూపుతుంది. కొన్ని నిర్ణయాలు ఇతరులపై ప్రభావం చూపిస్తాయి. ఏ పని అయినా మనకు మంచి జరుగుతుందని అనుకుంటేనే ముందుకు వెళ్లాలి.

ఎప్పుడైనా మనసులో ఏమనుకుంటున్నామో బయటకు తెలియకూడదు. ఎదుటి వారికి తెలియకుండా జాగ్రత్త వహించాలి. మనలోని ఆలోచనలు బయటి వారికి తెలియకుండా ఉండాలి. ముఖ కవలికలు, భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. మనం అప్పుల్లో నిండిపోయినా మన ముఖంపై చిరునవ్వు తొనకకుండా చూసుకోవాలి. అప్పుడే మనల్ని నమ్ముతారు. లేదంటే అందరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. చాణక్యుడు సూచించిన సలహాలు పాటిస్తే మనకు ఎన్నో రకాలైన లాభాలు రావడం సహజమే.
తెలివైన వారు పొగడ్తలకు పడిపోరు. ఎదుటి వారిని పొగడ్తల్లో ముంచేసి తమకు కావాల్సిన పనులు చేసుకుంటారు. పొగడ్త పన్నీరు లాంటిది. మీద జల్లుకోవాలి కానీ నీళ్లలా తాగకూడదు. పొగడ్తలకు పొంగిపోయేవారు విమర్శలకు కుంగిపోయే వారు జీవితంలో పైకి రారు. మన ప్రవర్తన నదిలా పారుతూ పోవాలి. ఏ విషయం మీదనైనా నిలబడితే గట్టిగా పోరాడాలి. ఎదుటివారు ఏదో అనుకుంటారని వెనక్కి తగ్గొద్దు. మనం అనుకున్న దాని కోసం నిరభ్యంతరంగా నిలబడి పోరాడాలి. విజయం సాధించే వకు విశ్రమించకూడదు.
బలహీనులను కూడా తక్కువగా అంచనా వేయొద్దు. శత్రువును నమ్మినా బలహీనున్ని నమ్మితే మోసపోవడం గ్యారంటీ. బలహీనుడైన వ్యక్తితో శత్రుత్వం ప్రమాదకరం. బలహీనుడైన వాడిని తక్కువగా చూడకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. అవకాశం కోసం చూసే బలహీనులు వీలు పడితే మనల్ని ఏం చేయడానికైనా సిద్ధపడతారు. ప్రతీకారం తీర్చుకునేందుకే ప్రాధాన్యం ఇస్తారు. బలహీనుడైన వ్యక్తి మనతో సమానంగా పరుగెత్తరు. కానీ పక్కనే ఉంటూ గోతులు మాత్రం తీస్తారు. సమయం వచ్చినప్పుడు మాత్రం తన తడాఖా చూపించడం సహజమే.