Chanakya Niti: చాణక్యుడు చెప్పిన కొన్ని మాటలు తూ.చ తప్పకుండా పాటిస్తే విజయం తథ్యం అంటారు చాలా మంది. అయితే ఈయన ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం చెప్పారు. అందులో ఇంటి నిర్మాణం గురించి కూడా చెప్పారు. వాస్తవానికి ఇల్లు అనేది ఒక వ్యక్తికి సౌకర్యం. శాంతిని పొందే ప్రదేశం కూడా. ప్రతి వ్యక్తి తన కుటుంబాన్ని ప్రేమిస్తారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబంలో సుఖశాంతులు నిలవాలి అనుకుంటారు. దీని కోసం మీ ఇల్లు సరైన ప్లేస్ లో ఉండాల్సిందే. మరి ఈ ఇంటి విషయంలో చాణక్యుడు ఏం చెప్పారో కూడా తెలుసుకుందాం..
ఈయన ప్రకారం.. ఒక వ్యక్తి తనకు గౌరవం లేని ప్రదేశంలో, దేశంలో అస్సలు ఉండకూడదు. అదే విధంగా జ్ఞానం, గుణాలను పొందే అవకాశం లేని ప్రదేశంలో నివసించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అంటారు చాణక్యుడు. వాస్తవానికి ఏ వ్యక్తి అయినా ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారుతూ ఉంటారు. కొత్త ఉద్యోగంలో చేరడం, కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం చాలా సార్లు వేరే దేశానికి కూడా వెళ్లారు. కానీ వీటిలో దేనికి అవకాశం లేనప్పుడు అటువంటి దేశంలో, ప్రదేశంలో నివసించకూడదు అంటారు చాణక్యుడు.
వేదాలు తెలిసిన బ్రాహ్మణులు మీరు నివసించే ప్రదేశంలో లేకుంటే.. మీరు ఆ ప్రదేశంలో ఉండకూడదు. ఇది కాకుండా నది, వైద్యుడు లేని ప్రదేశంలో మానవులు నివసించడం ఆమోదయోగ్యం కాదు. ఇక ఎలాంటి ప్రదేశాల్లో ఉండాలో కూడా చూద్దాం. ఉద్యోగం, వ్యాపారాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు లేని చోట స్థిరపడకూడదని చాణక్య నీతి చెబుతోంది. కాబట్టి ఎవరైనా ఈ వ్యవస్థలు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోవాలి.
ఎందుకంటే ఒకరు తమ సొంత జీవితాన్ని గడపడం లేదా ఒకరిని పోషించడం, కుటుంబాన్ని పోషించుకోవడం ఇక్కడ మాత్రమే సాధ్యమవుతుంది. ఒక స్నేహితుడు, బంధువు, సహాయకుడు జీవించి ఉండకపోతే, విపత్తు సంభవించినప్పుడు మీరు ఎవరి సహాయం తీసుకోలేకపోతారు. ఎందుకంటే మీకు సహాయం చేయడానికి కూడా ఎవరు ఉండరు.