https://oktelugu.com/

Cashew: జీడిపప్పుతో బరువు పెరుగుతారా? తగ్గుతారా? రెండింటిలో ఏది నిజం

జీడిపప్పు తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరగుతుందని, దీంతో తొందరగా బరువు పెరుగుతారని కొందరు అంటుంటారు. మరికొందరు ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సాయపడతాయని భావిస్తారు. ఇంతకీ జీడిపప్పు తినడం వల్ల బరువు తగ్గుతారా? లేకపోతే పెరుగుతారా? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 3, 2024 5:22 pm
    Cashew Nut

    Cashew Nut

    Follow us on

    Cashew: డ్రైఫ్రూట్స్‌ తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఈ డ్రైఫ్రూట్స్ చాలా ఖరీదు కూడా ఉంటాయి. అయిన కూడా వీటిని కొనుగోలు చేసి తింటుంటారు. అయితే ఈ డ్రైఫ్రూట్స్‌లో జీడిపప్పుకి ప్రత్యేకత ఉంది. తినడానికి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ జీడిపప్పు తినడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ పెరగుతుందని, దీంతో తొందరగా బరువు పెరుగుతారని కొందరు అంటుంటారు. మరికొందరు ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సాయపడతాయని భావిస్తారు. ఇంతకీ జీడిపప్పు తినడం వల్ల బరువు తగ్గుతారా? లేకపోతే పెరుగుతారా? అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.

    జీడిపప్పు డైలీ తినడం వల్ల బరువు పెరుగుతారు. ఇందులోని పోషకాలు శరీర బరువును పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. అయితే వీటిని తక్కువ పరిమాణంలో కాకుండా ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల బరువు పెరుగుతారు. జీడిపప్పు ఎక్కువగా తినడం వల్ల బాడీకి వేడి చేస్తుంది. దీంతో జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే అధికంగా బరువు ఉన్నవారు ఈ జీడిపప్పును తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇందులోని పోషకాలు బరువు పెరిగేలా చేస్తాయి. అయితే మితంగా తీసుకుంటేనే దీని ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. అధికంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు తప్పవు. జీడిపప్పులో మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. వీటిని తినడం వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు. దీంతో వేరే ఇతర ఫుడ్ తినకపోవడం వల్ల బరువు తగ్గుతారు.

    జీడిపప్పు తినడం వల్ల శరీరంలోని అలసట, బలహీనత అన్ని కూడా తొలగిపోతాయి. ఇందులో పొటాషియం, కాల్షియం, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. డైలీ రెండు నుంచి మూడు జీడిపప్పులు తినడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా తయారవుతాయి. కొందరు జీడిపప్పును స్మూతీలకు వాడుతుంటారు. ఇలా తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుతాయి. జీడిపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య నుంచి కూడా విముక్తి కల్పిస్తుంది. అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా జీడిపప్పు బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. డైలీ ఎక్కువగా కాకుండా సరైన మోతాదులో జీడిపప్పు తింటే శరీరానికి ప్రయోజనాలు చేకూరుతాయి. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. వీటిని డైరెక్ట్‌గా తినని వాళ్లు వంటల్లో వాడుతుంటారు. స్వీట్లు, బిర్యానీ ఇలా ఎందులో అయిన కూడా ఆడుకోవచ్చు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.