https://oktelugu.com/

Car Review: మారుతి సుజుకీ Baleno Vs మారుతి సుజుకీ Brezza

మారుతి సుజుకీ నుంచి బాలెనో ఆకట్టుకుంటుంది. 1197 సీసీ ఇంజిన్ పవర్ ను కలిగి ఉంది. 76.43 నుంచి 88.5 బి హెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : September 12, 2023 / 11:18 AM IST

    Car Review

    Follow us on

    Car Review: దేశీయ కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ అగ్రగామిగా ఉంది. వినియోగదారులకు అనుగుణంగా వివిధ మోడళ్లను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటోంది. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీల వరకు వివిధ వేరియంట్లు మారుతి సుజుకీ నుంచి రిలీజై ఇప్పుడు రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ తరుణంలో మిగతా కంపెనీలకు గట్టిపోటీ ఇస్తూ అప్డేట్ ఫీచర్స్ ను అమర్చుతుంది. అయితే ఇటీవల మారుతి సుజుకీ కంపెనీలోనే రెండు మోడళ్ల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఈ రెండు కార్లు వినియోగదారుల భద్రతలను కల్పిస్తుండడంతో పాటు ఆకర్షించే ఫీచర్స్ ఉండడంతో దేనీని సెలెక్ట్ చేసుకోవాలో తేల్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు మోడళ్లను పరిశీలిస్తే..

    మారుతి సుజుకీ నుంచి బాలెనో ఆకట్టుకుంటుంది. 1197 సీసీ ఇంజిన్ పవర్ ను కలిగి ఉంది. 76.43 నుంచి 88.5 బి హెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ , సీఎన్జీ ఫ్యూయెల్ ను కలిగిన ఇది లీటర్ కు 22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్ ఎక్స్ షోరూం ధర రూ.6.61 లక్షల నుంచి 9.88 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఇందులో ప్రయాణికుల భద్రతకు 6 ఎయిర్ బ్యాగులు అమర్చారు.

    బ్రెజ్జా ఫీచర్ విషయానికొస్తే 1462 సీసీ ఇంజిన్ తో 86.63 నుంచి 101.65 బీహెచ్ పీ పవర్ ను కలిగి ఉంటుంది. ఇది కూడా పెట్రోల్, సీఎన్జీ ఫ్యూయెల్ ను కలిగి ఉంది. లీటర్ పెట్రోల్ కు 17.38 నుంచి 19.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సౌకర్యవంతంగా 5 గురు కూర్చునే వీలుంటుంది. దీనిని 8.29 లక్షల నుంచి 14.14 లక్షలకు వరకు విక్రయిస్తున్నారు.

    కుటుంబ అవసరాల కోసం కారును కొనుగోలు చేయాలనుకున్న వారు ఈ రెండు కార్లపై దృష్టి పెడుతున్నారు. ఎక్కువ మైలేజ్ తో పాటు తక్కువ ధరలో వచ్చే ఈ మోడళ్లు విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రెండు కార్లు రూ.10 లక్షల లోపు ధరలు ఉండడంతో వీటిపై ఫోకస్ పెడుతున్నారు. బాలెనో ను హ్యాచ్ బ్యాక్ డిజైన్ ను కలిగి ఉంది. స్టైలింగ్ రూమి ఇంటీరియర్స్ తో పాటు సిటీ నావిగేషన్ ను చేస్తుంది. బ్రెజ్జా మాత్రం కాంపాక్ట్ ఎస్ యూవీని కలిగి ఉంటుంది. అయితే రెండు వెహికల్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ కలిగి ఉండడంతో భద్రత పరంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

    మారుతి బాలెనో లో అల్పా ఏఎంటీ భద్రత విషయంలో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లగ్జరీని అందిస్తుంది.కానీ బాలెనో అల్పాలో మాత్రం ఆటోమేటిక్ ప్రయోజనం లేదు. బ్రెజ్జా వీఎక్స్ఐ ఎస్ యూవీ రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ మూడు కార్లు ఇంటీరియర్ గా విశాలమైన స్పేస్ ను అందిస్తాయి. వీటిలో వారి అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేయొచ్చు.