Jobs In Cantonment Board: కంప్టీలోని కంటోన్మెంట్ బోర్డు నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ టీచర్, మిడ్‌వైఫ్, ఫీమెల్ వార్డ్ సర్వెంట్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 15,000 రూపాయల నుంచి 92,300 రూపాయల వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. స్కిల్ టెస్ట్, రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలుస్తోంది. ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కంటోన్మెంట్ బోర్డు, బంగ్లా నెం.40, టెంపుల్ రోడ్డు, కంప్టీ, నాగ్‌పూర్, మహారాష్ట్ర 441001 అడ్రస్ కు దరఖాస్తులను పంపాలి.
https://kamptee.cantt.gov.in/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 4 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.