Cancer: ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది క్యాన్సర్ (Cancer) బారిన పడుతున్నారు. ప్రస్తుతం దీని బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. దీనికి ముఖ్య కారణం మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల (Food Habits) వల్ల క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. పూర్వ కాలంలో ఆరోగ్యమైన ఆహారం తినేవారు. కానీ ప్రస్తుతం ఆరోగ్యానికి (Healthy) మేలు చేసే వాటి కంటే అనారోగ్యాన్ని ఇచ్చే వాటిని తింటున్నారు. వీటిని తినడం వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు (Womens) అయితే ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) వంటి వ్యాధులతో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే చాలా మంది ఈ సమస్యతో చనిపోతున్నారు. దీనికి తోడు నిద్ర, పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోకపోవడంతో చాలా మంది ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు బారిన పడుతున్నారు. కొందరు నైట్ షిఫ్ట్‌లు ఎక్కువగా చేస్తున్నారు. వేకువ జామున అందరూ లేచే సమయానికి కొందరు నిద్రపోతున్నారు. ఇలా చేయడం వల్ల కూడా కొందరు క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే క్యాన్సర్ అనేది కొన్ని అలవాట్లు ఉన్నవారికి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి ఏయే అలవాట్లు ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొందరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా రోజంతా అలసటగా అనిపిస్తుంది. అలాగే దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మింగడంలో కాస్త ఇబ్బందిగా అనిపించడం, చర్మంపై దద్దుర్లు రావడం, బరువు పెరగడం లేదా ఎక్కువగా తగ్గడం, మూత్ర సమస్యలు, చర్మం రంగులో మార్పు, బాడీ రాత్రి సమయాల్లో చెమటలు ఎక్కడం, కండరాలు నొప్పిగా అనిపించడం, జుట్టు ఎక్కువగా రాలిపోవడం వంటి సమస్యలు ఉన్నవారికి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొందరు శారీరకంగా దృఢంగా ఉండటం లేదు. ఎక్కువగా కూర్చోని ఉద్యోగం చేయడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజంతా రెస్ట్ తీసుకుని పూర్తిగా ఎలాంటి వ్యాయామం చేయని వారికి తప్పకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చాలా పరిశోధనల్లో తేలింది.
కొందరు సరిగ్గా నిద్రపోరు. నైట్ షిఫ్ట్‌లు చేయడం, తక్కువగా నిద్రపోవడం వంటి సమస్యలు ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎంత పని చేసినా కూడా రోజుకి తప్పకుండా 8 గంటలు నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మద్యం, ధూమపానం వంటివి సేవించే వారికి ఎక్కువగా క్యాన్సర్ వస్తుంది. వీటి వల్ల ఎక్కువగా కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కొందరు అసురక్షితంగా ఎక్కువ మందితో కలయికలో పాల్గొంటారు. వీటివల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవే కాకుండా కుటుంబంలో ఎవరికైనా కూడా క్యాన్సర్ ఉంటే తప్పకుండా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఎవరికైనా ఉంటే మాత్రం ఎప్పటికప్పుడు చికిత్స తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.