https://oktelugu.com/

Cancer : ఆ మసాలాతో క్యాన్సర్‌కు చెక్‌.. రీసెర్చ్‌లో షాకింగ్ నిజాలు!

అయితే రాబోయే రోజుల్లో దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపి..క్యాన్సర్‌ మహమ్మారిని దూరం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 27, 2023 / 06:58 PM IST
    Follow us on

    Cancer : క్యాన్సర్‌.. వేగంగా విస్తరిస్తున్న వ్యాధి. కారణం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, స్త్రీ పురుష భేదం చూడకుండా చాలా మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. పెరుగుతున్న కాలుష్యం, రసాయనాల వినియోగం, ప్లాస్టిక్‌ వాడకంతో వ్యాధి బాధితులూ పెరుగుతున్నారు. అయితే ఈ వ్యాధి నియంత్రణకు, రాకుండా చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఓ పరిశోధనలో మనం ఇంట్లో వాడే మసాలాతోనూ క్యాన్సర్‌కు చెక్‌ పెట్టవచ్చని గుర్తించారు. ఆ మసాలా ఏంటి.. ఎలా నిరోధిస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం.

    దాల్చిన చెక్కలో ఔషధ గుణాలు..
    ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం తీసుకునే ఆహారం, ఆహార పదార్ధాలతోనే శరీరంలోని అవయవాలు సరిగా పని చేస్తాయి. వ్యాధులు, రోగాల బారినపడకుండా కాపాడుతాయి. ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉండేలా చేస్తాయి. దాల్చినచెక్క.. ఇది అందరి వంటింట్లో ఉంటుంది. చౌకగా మార్కెట్‌లో దొరికే మసాలా. దీనిలోని ఔషధ గుణాలు ఆక్సిడేటివ్‌ ఒత్తిడిని నిరోధిస్తాయని, దీంతో ప్రొస్టేట్‌ గ్రంథిలో క్యాన్సర్‌ కణాల వ్యాప్తి తగ్గుతుందని ఎన్‌ఐఎన్‌ ఎండోక్రోనాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ అయేషా ఇస్మాయిల్‌ తెలిపారు. దాల్చినచెక్క కారణంగా ఎముకల క్షీణత కూడా తగ్గిందని పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలు అంతర్జాతీయ జర్నల్‌ క్యాన్సర్‌ ప్రివెన్షన్‌ రిసెర్చ్‌లో ప్రచురితమయ్యాయి.

    సమస్యగా క్యాన్సర్‌..
    క్యాన్సర్‌ ప్రాణాంతక వ్యాధి. ప్రస్తుతం ఈ వ్యాధి చాలా మందికి సమస్యగా మారింది. అయితే ఇందులో అనేక రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా గ్రంధి క్యాన్సర్‌ కూడా ప్రాణాంతకమైనదే. అందుకే ఈ క్యాన్సర్‌ను దూరం చేసే అంశంపై పలు పరిశోధనలు జరిగాయి. హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ ఈ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కి మందు కనుగొనే విషయంపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇంట్లో వంటల్లో ఉపయోగించే దాల్చిన చెక్కతో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ నయం చేయవచ్చని వెల్లడైంది.

    ఎలుకలపై అధ్యయనం..
    ప్రొస్టేట్‌ గ్రంథి క్యాన్సర్‌ నయం చేయడానికి ఎన్‌ఐఎన్‌ ముందుగా ఎలుకలపై అద్యయనం చేసింది. దాల్చిన చెక్కల్లో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్‌–బి2 పదార్ధాలు క్యాన్సర్‌ రాకుండా చేస్తాని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ సంస్థ వెల్లడించింది. వంటల్లోని మసాలా దినుసుల్లో ఉపయోగించే చెక్క లాంటి దాల్చిన చెక్క పదార్ధం వల్ల ఎముకల క్షీణత తగ్గుతుందని రీసెర్చ్‌లో తేలింది. దాల్చిన చెక్కలో ఉండే సినామల్‌డిహైడ్, ప్రొసైనిడిన్ బి2 పదార్థ్దాలను ఆహారంలో కలిపి ఎలుకలకు ఇచ్చి పరిశీలించారు. అటుపై ఎలుకలకు క్యాన్సర్‌ కారక కణాలను ప్రవేశపెట్టారు. ఇలా చేసిన 16వారాల తర్వాత తిరిగి పరీక్షలు నిర్వహించగా దాల్చిన చెక్క, అందులోని ఔషద గుమాల వల్ల 60–70శాతం ఎలుకలు ప్రొస్టేట్‌ గ్రంధి క్యాన్సర్‌ ప్రభావానికి గురి కాలేదని గుర్తించారు.

    క్యాన్సర్‌ కణాల వ్యాప్తి అదుపు..
    దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు ఆక్సిడేట్‌ ఒత్తిడిని నిరోధిస్తాయని..ప్రొటెస్ట్‌ గ్రంథిలోని క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని తగ్గిస్తాయని ఎన్‌ఐఎన్‌ ఎండోక్రోనాలజీ విభాగం స్పష్టంగా వెల్లడించింది. దాల్చిన చెక్క కారణంగా ఎముకల క్షీణత కూడా తగ్గిందని పేర్కొన్నారు. క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధికి చెక్‌ పెట్టడానికి జాతీయ ఆహార సంస్థ ఎలుకలపై చేపట్టిన ప్రయోగం, అధ్యయన ఫలితాలను ఓ ప్రకటనలో తెలిపింది. అయితే రాబోయే రోజుల్లో దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపి..క్యాన్సర్‌ మహమ్మారిని దూరం చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.