Cancer: ఈ మధ్య కాలంలో పురుషులకు ఎక్కువగా ప్రోస్టేట్ క్యాన్సర్(Prostate Cancer) వంటివి వస్తున్నాయి. ఈ సమస్య వస్తే పురుషులు(Mens) చాలా ఇబ్బంది పడతారు. ప్రొస్టేట్ క్యాన్సర్ చాలా ప్రమాదమైనది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రోస్టేట్ అనేది పురుషుల శరీరంలో ఉండే ఒక గ్రంథి. చాలా మంది వీటిని లైట్ తీసుకుంటారు. ఈ సమస్య ఉన్నవారు సకాలంలో చికిత్స(Treatment) తీసుకుంటేనే దీన్ని నయం చేయగలరు. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది. ప్రస్తుతం రోజుల్లో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని మొదట్లోనే తగ్గించుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు. లేకపోతే అది క్యాన్సర్‌కు దారితీసి ప్రాణాల మీదకు తెస్తుంది. అయితే పురుషులకు ప్రోస్టేట్ గ్రంధి లోపల ఉండే కణజాలం పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. కణాజాలం పెరిగితే గ్రంధి కూడా పెరుగుతుంది. దీంతో మూత్రం, మూత్ర విసర్జన చేయడంలో కాస్త ఇబ్బంది ఉంటుంది. అప్పుడే చికిత్స తీసుకోవాలి. ఒకవేళ ఆలస్యం చేస్తే మాత్రం అది క్యాన్సర్‌కు దారి తీసి చివరకు మరణం సంభవించేలా చేస్తుంది.
ప్రోస్టేట్ సమస్య అనే వయస్సు బట్టి వస్తుంది. అలాగే జీవనశైలిలో మార్పుల వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొందరికి జన్యుపరమైన సమస్యల వల్ల కూడా వస్తుంది. ఈ ప్రోస్టేట్ సమస్య 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల మధ్య వాళ్లకి ఎక్కువగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య మూత్ర నాళాల ఇన్ఫెక్షన్, మూత్రాశయ సంక్రమణం, మూత్రపిండాల సమస్యల వల్ల వస్తుంది. అయితే ఈ సమస్య వచ్చిన వారి స్థాయిని బట్టి చికిత్స తీసుకోవాలి. ఈ సమస్య స్థాయి 0-4 మధ్యలో ఉండే సాధారణం. 4-10 అయితే అంటు వ్యాధులు, 10 కంటే ఎక్కువ అయితే ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చినట్లే. మీరు సాధారణంగా ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే ఈ సమస్యను తగ్గించగలరు. లేకపోతే సమస్య మరింత తీవ్రం అవుతుంది. ఈ క్యాన్సర్ ఉన్నవారికి సడెన్‌గా మూత్రం ఆగిపోతుంది. ఒక్కోసారి మూత్ర విసర్జన చేసినప్పుడు మంట, నొప్పి ఉంటాయి. అలాగే మూత్రం వచ్చిన వెంటనే ఆపుకోలేరు. నడుము, తుంటి, ఛాతీలో ఎక్కువగా నొప్పి ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. లేకపోతే సమస్య తీవ్రం అవుతుంది.
ఈ సమస్యను తగ్గించుకోవడానికి మందులు తీసుకోవడంతో పాటు జీవనశైలిని మార్చుకోవాలి. రోజూ సొరకాయ, తులసి ఆకులు, ఎండుమిర్చి కలిపి చేసిన రసం తాగితే ఈ సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే తులసి, వేప, గోధుమ గడ్డి, అలోవెరా కూడా ప్రొస్టేట్ క్యాన్సర్‌కు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి విముక్తి పొందాలంటే ఫైబర్ ఉండే ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే బార్లీ గింజల వాటర్ తీసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు తినాలి. బయట ఫాస్ట్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. మద్యం, ధూమపానం వంటివి సేవించకూడదు. డైలీ వ్యాయామం, మెడిటేషన్, యోగా వంటివి చేయాలి. శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.