Vacations : విహారయాత్రలతో మానసిక సమస్యల నుంచి బయటపడవచ్చా?

ఎందుకంటే ప్లాన్ చేసుకున్నాక వెళ్లకపోతే మీరు నిరాశకు గురవుతారు. దీనివల్ల మీరు చేసే పనుల్లో అంత ఇంట్రెస్ట్ చూపించలేరు. కాబట్టి సడెన్‌గా విహారయాత్రలకు వెళ్లండి. ఎలాంటి ప్లాన్‌లు చేసుకోకుండా వెళ్లండి.

Written By: NARESH, Updated On : August 17, 2024 10:09 pm

vacations

Follow us on

vacations : విహారయాత్రలకు వెళ్లడం చాలామందికి ఇష్టం ఉంటుంది. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లి టైమ్ స్పెండ్ చేస్తుంటారు. కానీ కొందరు ఉండే వాళ్ల బిజీ లైఫ్ వల్ల అస్సలు బయటకు వెళ్లరు. కనీసం సెలవు రోజు కూడా బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. ఎప్పుడూ ఒకే ప్లేస్‌లో ఉండటం వల్ల మీ మైండ్ అంత ఫ్రీ కాదు. అప్పుడప్పుడు బయటకు వెళ్తే కాస్త రిలాక్స్ అవ్వచ్చు. కొత్త ప్రదేశాలకు వెళ్తే శరీరంలోని హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి. దీంతో రోజంతా సంతోషంగా ఉండటంతో పాటు మైండ్ కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. విహారయాత్రల వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. మానసికంగా సంతోషంగా ఉంటే జీవితంలో ప్రతి సమస్యలను చిరునవ్వుతో సాధించవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి యోగా, మెడిటేషన్, వ్యాయామం ఎంత ముఖ్యమూ విహారయాత్రలు కూడా అంతే ముఖ్యం.

కొంతమంది ఈరోజుల్లో సమయం వెచ్చించి మరి బయటకు వెళ్తున్నారు. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా సంతోషంగా ఉంటారు. నెలకొకసారి అయిన కొత్త ప్రదేశాలకు వెళ్తే ఒత్తిడి నుంచి విముక్తి పొందవచ్చు. కొత్త వాతావరణం వల్ల శరీరంలో సెరటోనిన్, డోపమైన్ విడుదలవుతాయి. ఇవి ఆనందాన్ని ఇస్తాయి. అలాగే కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తులను కలుసుకోవడం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆ పచ్చని ప్రకృతి అందాలు ఆస్వాదిస్తుంటారు. కాస్త చిరాకుగా అనిపిస్తే బయటకు వెళ్లండి. మీలో చిరాకు అంతా పోయి చాలా ఫ్రీ అవుతారు. కొత్త ప్రదేశాల్లో వ్యక్తులను కలిసి వాళ్లతో మాట్లాడటం వల్ల మీ మైండ్‌లో ఆలోచనలు ఇంకా మారుతాయి. కొత్త అనుభవాల వల్ల మెదడు ఉత్తేజితమవుతుంది. దీంతో మీలో ఆలోచన ధోరణితో పాటు అర్థం చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.

విహారయాత్రల వల్ల మీలో మీకు తెలియని కొన్ని విషయాలు కూడా తెలుసుకోగలరు. మన కంటే లైఫ్‌లో బాధపడే వాళ్లను చూసి మీకు కూడా అనిపిస్తుంది. ఉన్న లైఫ్‌ని ఎంజాయ్ చేసి హ్యాపీగా బ్రతకాలని భావిస్తారు. అందరితో కలిసి విహారయాత్రలకు వెళ్లవచ్చు. అలాగే ఒక్కరూ వెళ్లవచ్చు. ఒంటరిగా వెళ్లడం వల్ల మీరు చాలా విషయాలు తెలసుకోగలుగుతారు. జీవితంలో భయం పోయి ఏదైనా సాధించగలరనే నమ్మకం కలుగుతుంది. అలాగే బ్రేకప్ నుంచి బయటపడాలంటే విహారయాత్రలకు వెళ్లండి. తప్పకుండా మీరు ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. కనీసం మూడు నెలలకు ఒకసారి అయిన విహార యాత్రలకు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా సంతోషంగా ఉంటారు. వీటిని ప్లాన్ చేసుకుని వెళ్లకండి. అనుకోకుండా ప్లాన్ చేయకుండా సడెన్‌గా వెళ్లండి. ఎందుకంటే ప్లాన్ చేసుకున్నాక వెళ్లకపోతే మీరు నిరాశకు గురవుతారు. దీనివల్ల మీరు చేసే పనుల్లో అంత ఇంట్రెస్ట్ చూపించలేరు. కాబట్టి సడెన్‌గా విహారయాత్రలకు వెళ్లండి. ఎలాంటి ప్లాన్‌లు చేసుకోకుండా వెళ్లండి.