Doctors on Dreams: గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కలలు వస్తుంటాయి. ఇందులో కొన్ని పీడకలు ఉంటాయి. మంచి కలలు కూడా ఉంటాయి. అయితే చాలామందికి కలలు గుర్తుండవు.. కొంతమందికి కలలు రావడమే ఆలస్యం.. భయపడిపోతుంటారు. గాఢ నిద్రలో ఉన్నప్పటికీ కూడా వెంటనే పైకి లేసి కూర్చుంటారు. బిగ్గరగా అరుస్తూ ఉంటారు. అయితే ఇటువంటి పరిణామాలు అందరిలో కాకుండా కొంతమందిలో మాత్రమే చోటు చేసుకుంటాయి. ధైనం దిన జీవితంలో చోటుచేసుకున్న మార్పులే వారికి అలా కలల రూపంలో వస్తుంటాయని వైద్యులు చెబుతుంటారు.
కలల వల్ల చాలామంది నిద్రలో ఇబ్బంది పడుతుంటారు. అయితే వాటిని నియంత్రించే సామర్థ్యం మనకుందా? అసలు అది సాధ్యమవుతుందా.. ఈ ప్రశ్నలు వైద్యులను అడిగితే వారు చెబుతున్న సమాధానం ఆసక్తికరంగా ఉంది. “కలలను నియంత్రించడానికి సురక్షితమైన మార్గం అంటూ లేదు. అవి నిద్రలో భాగమై ఉంటాయి. వీటిని వైద్య పరిభాషలో rapid eye moment అని పిలుస్తుంటారు.. ఇవి నిద్రలో సహజంగానే వస్తుంటాయి. కలలు జ్ఞాపకాలను స్థిరీకరిస్తాయి. మానసిక ప్రక్రియలను బలోపేతం చేయడానికి దోహదం చేస్తాయి. అందువల్లే కలలను నియంత్రించడం సాధ్యం కాదు. ఆపాలని ప్రయత్నించడం మంచిది కాదని” వైద్యులు సూచిస్తున్నారు.
కలల వల్ల కొంతమంది ఊహ జీవితమైన జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. తాము నిజ జీవితంలో చేయలేని పనులను చేసినట్టు ఊహించుకుంటారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులం అయిపోయినట్టు.. ఎవరికి సాధ్యం కానీ ఉద్యోగాలు సాధించినట్లు.. అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నట్టు.. అచంచలమైన సౌకర్యాలను ఆస్వాదిస్తున్నట్టు కలలుగంటుంటారు. అలాంటి కలలు కంటున్న సమయంలో చాలామంది ఒత్తిడిని మర్చిపోతుంటారు. తమలో ఉన్న నెగిటివిటీని దూరం చేసుకుంటారు. అంతేకాదు సాధ్యమైనంతవరకు సానుకూలమైన భావనలను సొంతం చేసుకుంటారు. అందువల్లే వారిలో మానసిక పరిపక్వత మెరుగ్గా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు కూడా అద్భుతమైన కలలు కనుక వస్తే కొంతలో కొంత సాంత్వన పొందుతారని మానసిక వైద్యులు చెబుతున్నారు.
జీవితంలో నిత్యం వేదనలు.. ఇబ్బందులు.. అవరోధాలు.. ప్రతికూల భావనలను ఎదుర్కొన్న వారికి పీడకలు వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. అటువంటివారు మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటారని.. కొన్ని సందర్భాలలో గాఢనిద్రను కూడా కోల్పోతుంటారని.. నిద్రలో ఉన్నప్పుడే బిగ్గరగా అరుస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటివారు సాధ్యమైనంతవరకు సానుకూల దృక్పథాలలో జీవించాలని.. పాజిటివిటీ ఆలోచనలతో జీవితాన్ని గడపాలని వైద్యులు చెబుతున్నారు. కలలను నియంత్రించకూడదని.. అలా చేస్తే అది మనిషి జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని వైద్యులు అంటున్నారు.