Turmeric Milk: మనకు వంటింట్లో ఉండే దినుసులతోనే మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. కానీ మనమే పట్టించుకోం. వాటిని లెక్కలోకి తీసుకోం. దీంతో రోగాల బారిన పడుతున్నాం. అయినా సరే పరిష్కార మార్గాలు వెతకడం లేదు. వంటింటిని వైద్యానికి ఉపయోగించుకోవడం లేదు. మన వంటింట్లో ఉండే పసుపుతో మనకు ఎన్నో లాభాలు ఉన్నాయని ఎంతమందికి తెలుసు. పసుపు మనకు గాయాలైనప్పుడు రక్తం కారకుండా నిరోధించేందుకు వాడుతుంటారు. చలికాలంలో పసుపు వాడకంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో మనకు సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

చలికాలంలో ఆరోగ్యాన్ని రక్షించే ఔషధంగా పసుపు ప్రధాన పాత్ర పోషిస్తుంది. పసుపును పాలతో కలిపి తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఔషధ గుణాలు పుష్కలంగా ఉండటంతో దీన్ని వంటల్లో కూడా వాడుకుంటాం. పసుపును రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఫలితం ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా మారుతుంది. ఆయుర్వేదంలో కూడా పసుపుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తుంటారు. పలు రోగాలకు మందుగా వాడుతారు. దీంతో పసుపుతో చాలా రోగాలు నయమవుతాయి.
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వాపులను తగ్గిస్తుంది. బరువును నిరోధిస్తుంది. అధిక బరువు ఉన్న వారు నిత్యం పసుపు వాడితే ప్రయోజనం కలుగుతుంది. చలికాలంలో పసుపును పాలతో కలిపి తీసుకుంటే ఎంతో ప్రయోజనం. శీతాకాలంలో పసుపును పాలతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉండటంతో జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనకు మేలు కలిగిస్తాయి.

జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి జ్వరాలకు కూడా పసుపును ఔషధంగా తీసుకుంటారు. పసుపును పాలల్లో కలిపి తీసుకుంటే ఎన్నో లాభాలున్నాయి. ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తీసుకుని అందులో టీ స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకుని తాగితే ఎన్నో రకాల వ్యాధులకు మందులా పనిచేస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు, మధుమేహం వంటి రోగాలను నియంత్రిస్తాయి. కుర్కుమిన్ సీరం కొవ్వును తగ్గిస్తుంది. చలికాలంలో ప్రతి రోజు పసుపు వేసిన పాలను తాగడం వల్ల మనకు పలు విధాలుగా మేలు కలుగుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఇన్ని లాభాలున్న పసుపును కచ్చితంగా వాడుకోవాలని సూచిస్తున్నారు.