https://oktelugu.com/

Amazon: అమెజాన్ లో వస్తువులు కొంటున్నారా? అయితే మీ డబ్బు మాయం!

ఆన్లైన్లో మీరు ఇప్పటికే కొన్ని వస్తువులు కొనుగోలు చేశారు. అమెజాన్ లో మరీ తక్కువకు వస్తువులు లభ్యమవుతాయనే ఉద్దేశంతో ఇందులో ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. దీంతో మీ నెంబర్ ను కొందరు సేవ్ చేసుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 2, 2023 / 04:22 PM IST

    Amazon

    Follow us on

    Amazon: బయట షాపుల్లో దొరికే వస్తువుల కంటే ఆన్లౌన్లో వస్తువులు చాలా తక్కువ ధరకు లభ్యమవుతాయి. వీటిని అమెజాన్, ఫ్లిక్ కార్డ్ వంటి సంస్థలు తమ వినియోగదారులకు ఆఫర్ల కింద బయటి కంటే తక్కువ ధరకే అందిస్తాయి. దీంతో వీటికి ఆకర్షితులై చాలా మంది ఆమెజాన్ ద్వారా వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఆమెజాన్ లో వస్తువులు కొనే వరకు బాగానే ఉంటుంది.కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మీ బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం మాయమై పోతుంది. మీకు వచ్చిన ఓటీపీ చెప్పమని కొందరు కేటుగాళ్లు డబ్బునంతా దోచేస్తుంటారు. అదెలాగంటే?

    ఆన్లైన్లో మీరు ఇప్పటికే కొన్ని వస్తువులు కొనుగోలు చేశారు. అమెజాన్ లో మరీ తక్కువకు వస్తువులు లభ్యమవుతాయనే ఉద్దేశంతో ఇందులో ఎక్కువగా షాపింగ్ చేస్తుంటారు. దీంతో మీ నెంబర్ ను కొందరు సేవ్ చేసుకుంటారు. ఇలా సేవ్ చేసుకున్న తరువాత ఒక్కోసారి మీరు ఏ వస్తువు కొనుగోలు చేయకపోయినా మీ నెంబర్ తో ఆర్డర్ పెడుతారు. ఇలా ఆర్డర్ పెట్టే వస్తువు లక్షకు పైగా ఉండొచ్చు. ఈ క్రమంలో అమెజాన్ కంపెనీ వాళ్లు మీరే వస్తువును ఆర్డర్ చేశారు కావొచ్చు అని వస్తువులను ఇంటికి తెస్తారు.

    ఇలా తెచ్చిన తరువాత వస్తువులు ఆర్డర్ చేయకపోయినా ఇంటికి ఎలా వస్తాయి? అని షాక్ అవుతారు. అయితే ఇదే సమయంలో క్యాన్సిల్ చేయమంటారు. క్యాన్సలైజేషన్ కోసం వస్తువులు తీసుకొచ్చిన వ్యక్తి ఫోన్ కు ఏదో మెసేజ్ పంపించి ఓటీపీ చెప్పమని అంటారు. ఇలా అవగాహన లేకుండా ఓటీపీ నెంబర్ చెబితే బ్యాంకులోని డబ్బంతా కాజేస్తాడు. అమెజాన్ లో వస్తువులు ఆర్డర్ చేయకపోయినా ఇంటికి వచ్చాయంటే అనుమానం తప్పకుండా రావాలి. ఇలాంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ చెప్పకుండా ఉండడమే మంచిదని టెక్ నిపుణులు అంటున్నారు.

    ఈ నేపథ్యంలో ఆన్లైన్లో వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కచ్చితమైన వస్తువులు కొనాలనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ చేసుకోండి. లేదా మీరు ఆర్డర్ చేయకున్నా వస్తువులు ఇంటికి వస్తే తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉండండి. అంతేగానీ ఓటీపి ఇలా చెప్పడం వల్ల భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.