Buying Used Car: ప్రయాణ సాధనాల్లో సౌకర్యాలు చూసుకుంటున్నారు. పూర్వం రోజుల్లో అయితే నడకనే వెళ్లే వారు. కొంత కాలానికి ఎడ్ల బండ్లు ఉపయోగించేవారు. తరువాత కాలంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రస్తుతం అధునాతన సదుపాయాలు అందుబాటులోకి రావడంతో ప్రజల ఆలోచనలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. గతంలో ఇంట్లో సైకిల్ ఉంటేనే ఎంతో గొప్పగా భావించేవారు. కానీ ఇప్పుడు సైకిళ్లు తెరమరుగయ్యాయి. వాటి స్థానంలో ద్విచక్ర వాహనాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో మొత్తం కార్ల ట్రెండ్ రానుంది. ఇప్పటికే పలువురు కార్లు వినియోగిస్తున్నారు. దీంతో రాబోయే కాలంలో కార్లే రానున్నాయని సంకేతాలు వస్తున్నాయి.

సెకండ్ హ్యాండ్ అయినా సరే కారు ఉంటే ఆ దర్జాయే వేరు. దీంతో కార్ల కొనుగోలు డిమాండ్ పెరుగుతోంది. దేశంలో కార్ల విక్రయాలు కూడా భారీగానే సాగుతున్నాయి. ఉత్పత్తి కన్నా ఎక్కువ డిమాండ్ ఉండటంతో కార్ల సంస్థలు నిర్విరామంగా యూనిట్లు తయారు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. సోషల్ స్టేటస్ చూపించుకోవాలంటే కారు కొనుగోలు చేయాల్సిందే. ఇంటి ముందు కారు నిలపాల్సిందే. దీంతోనే మనకు ఎంతో విలువ వస్తుంది. అందుకే కారు కొనడానికి సాధారణ ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: జింబాబ్వేపై గెలిచినా టాప్ లోకి రాని టీమిండియా

పాత కారును కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, బీమా పాలసీ, కారు ఇన్ వాయిస్ వంటి వాటిని పరిశీలించాలి. దీంతో కారు సర్వీసింగ్, మెకానిక్ భాగాలు మార్చారా? మరమ్మతులు జరిగాయా? అనే విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఎందుకంటే భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటే పాత కారు కొన్నా అందులో సమస్యలు ఉండకుండా చూసుకుంటేనే ఉత్తమం. కారును క్షుణ్ణంగా పరిశీలించాలి. అద్దాలు చూడాలి. ఏవైనా గీతలు ఉంటే గుర్తించాలి.
కారు మైలేజీని చెక్ చేయాలి. పదిహేను కిలోమీటర్లు ప్రయాణిస్తే కారు మైలేజీ గురించి ఓ అవగాహన వస్తుంది. భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకుని మెకానిక్ కు చూపించడం మంచిది. మార్కెట్ లో దానికున్న డిమాండ్ ను బట్టి ఎంత ధర పలుకుతుందో అంచనా వేయాలి. ఎంత ధర చెల్లించవచ్చో కూడా తెలుసుకుంటే ప్రయోజనం. కారుకు పెయింట్ వేయించారా? భాగాలపై ఏవైనా గీతలు పడ్డాయా? పరిశీలించుకోవాలి. పాత కారు కొనే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్ లో దాని వల్ల ఎలాంటి నష్టం లేకుండా చూసుకోవాలి.