spot_img
Homeబిజినెస్Buying New Car: కారు కొంటున్నారా.. ఏది ఎంచుకోవాలో తెలుసా?

Buying New Car: కారు కొంటున్నారా.. ఏది ఎంచుకోవాలో తెలుసా?

Buying New Car: కారు.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసరంగా మారుతోంది. దీంతో అప్పో సప్పో చేసి కారు కొనుగోలుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో నాలుగేళ్లుగా కార్ల కొనుగోళ్లు పుంజుకున్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్లలో ఏది కొనుగోలు చేయాలి, ఏ వేరియంట్‌ ఎంచుకోవాలి.. వంటి ఆలోచనలు కొంత ఒత్తిడికి గురిచేస్తున్నాయి. దీని కోసం చాలా మంది నిపుణులను లేదా కార్ల యాజమానులను సంప్రదిస్తున్నారు. అయినా ఒక్కోసారి సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. కొనుగోలు చేశాక తప్పుడు నిర్ణయం తీసుకున్నామా అని బాధపడుతున్నారు. ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ లేదా మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ వేరియంట్లలో చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

నిపుణులు ఏమంటున్నారంటే..
ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్, మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ విషయంలో నిపుణులు కూడా వివిధ అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. మాన్యువల్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌లు రెండింటిలో కొన్ని లాభాలు, నష్టాలు ఉన్నాయి. రెండింటి గురించి పూర్తి అవగాహన ఉంటే ఎంపిక చేసుకోవడం సులభం అవుతుంది.
తక్కువ ధరలో..
ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన కార్ల కంటే మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ కలిగిన కార్ల ధర కాస్త తక్కువగా ఉంటుంది. మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్ల నిర్వహణ కూడా చౌకగా ఉంటుంది. ఫలితంగా మాన్యువల్‌ కార్లుతో డబ్బు కొద్దిగా ఆదా అవుతుంది. సుమారు 15 శాతం ఇంధనం ఆదా అవుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న అధునాత ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ కలిగిన కార్లు.. మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ వేరియంట్‌ తరహాలోనే సుమారుగా మైలేజ్‌ ఇస్తున్నాయి.

మైలేజీ, మెయింటనెన్స్‌ ముఖ్యం..
మధ్య తరగతి కుటుంబాలు ప్రస్తుతం కార్లు ఎక్కువగా కొంటున్నాయి. ఒకప్పుడు సంపన్నుల ఇళ్లకే పరిమితమైన కారు.. ఇప్పుడు మిడిల్‌ క్లాస్‌ ఇళ్ల ముందు కూడా పార్క్‌ చేసి ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కారు ఎంపికలో రెండు అంశాలకే వీరు ప్రాధాన్యం ఇస్తున్నారు. మైలేజ్, మెయింటనెన్స్‌ విషయంలో ఎక్కువ దృష్టిపెడుతున్నారు. కొంతమంది కంఫర్ట్, ఇంకొంతమంది ఎక్కువ మంది ఉండే వాహనం కోసం చూస్తున్నారు. ఆదాయం, ఖర్చు బేరీజు వేసుకుని తుది నిర్ణయం తీసుకుంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
Oktelugu Epaper
Exit mobile version