ప్రముఖ కంపెనీలలో ఒకటైన వాట్సాప్ యూజర్లకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. యూజర్లకు మెరుగైన సేవలను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో వాట్సాప్ మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ కు సంబంధించి కీలక మార్పులు చేయనుందని తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు మెసేజ్ పంపిన నెలరోజుల తర్వాత కూడా మెసేజ్ ను డిలీట్ చేయవచ్చు.
ప్రస్తుతం డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ ద్వారా కేవలం గంట సమయంలోపు మాత్రమే మెసేజ్ ను డిలీట్ చేసే అవకాశం ఉండగా కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. నెల రోజుల తర్వాత కూడా మెసేజ్ ను డిలీట్ చేసే విధంగా వాట్సాప్ యాప్ కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ అయిన వాట్సాప్ బీటా ఇన్ఫో పేర్కొంది.
2017 సంవత్సరంలో వాట్సాప్ యాప్ ఈ ఫీచర్ ను పరిచయం చేయడం గమనార్హం. డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ ద్వారా యూజర్ మెసేజ్ పంపిన నిర్ణీత సమయంలో పంపిన మెసేజ్ లో ఏదైనా తప్పు ఉంటే ఆ మెసేజ్ లను డిలీట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. వాట్సాప్ ఈ ఫీచర్ తో పాటు వీడియో ప్లే బ్యాక్ ఇంటర్ ఫేస్ ఫీచర్ ను కూడా తీసుకురానుందని సమాచారం అందుతోంది.
వీడియో ప్లే బ్యాక్ ఇంటర్ ఫేస్ సహాయంతో యూట్యూబ్ లింక్ లు వాట్సాప్ లో షేర్ చేసిన సమయంలో పూర్తి స్క్రీన్ లో వీడియోను చూసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ట్రయల్స్ కోసం ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.