Brezza: మైలేజీకి మొగుడు ఈ కారు… తక్కువ ధరలో దూసుకు పోతుందంతే..

దేశీయ కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఈ కంపెనీ నుంచి ఎన్నో మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకున్నాయి. మారుతి సుజుకీ నుంచి రిలీజై ఆకట్టుకుంటున్న కారు బ్రెజ్జా.

Written By: Chai Muchhata, Updated On : October 31, 2023 4:06 pm

Brezza

Follow us on

Brezza: భారత్ తో కార్లు కొనేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కరోనా తరువాత ప్రతి ఒక్కరు సొంత వెహికిల్ ఉండాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం తమ బడ్జెట్ కు అనుగుణంగా కారును కొనాలని చూస్తున్నారు. కంపెనీలు సైతం ఆయా పీపుల్స్ కు అనుగుణంగా వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ కార్లపై వినియోగదారులు సైతం మనసు పారేసుకొని వాటి కోసం ఎగబడుతున్నారు. లేటేస్టుగా ఓ కారు మైలేజ్ విషయంలో ది బెస్ట్ గా నిలుస్తోంది. ఆ కారు వివరాల్లోకి వెళితే..

దేశీయ కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుంది. ఈ కంపెనీ నుంచి ఎన్నో మోడళ్లు మార్కెట్లోకి వచ్చి ఆకట్టుకున్నాయి. మారుతి సుజుకీ నుంచి రిలీజై ఆకట్టుకుంటున్న కారు బ్రెజ్జా. నేటి కాలంలో ఎక్కువ మంది SUV కార్లను కోరుకుంటున్నారు. దీంతో మారుతి సుజుకీ SUV వేరియంట్ లో బ్రెజ్జాను తీసుకొచ్చింది. సరైన ఇంజిన్ పవర్ తో పాటు అత్యధిక మైలేజ్ ఇస్తూ ఆకట్టుకుంటుంది.

బ్రెజ్జా 1.5 లీటర్ తో హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగి ఉంది. 103 బీహెచ్ పీ పవర్ తో పాటు 137 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. వీటితో పాటు 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను కలిగి ఉంది. ఈ కారులో పెట్రోల్ ఫ్యూయెల్ తో పాటు CNG వేరియంట్ కూడా కలదు.9 అంగుళాల స్మర్ట్ ప్రో ప్లస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీని అందిస్తుంది.

అత్యంత అప్డేట్ ఫీచర్లను ఆకట్టుకుంటున్న ఈ కారు రూ.8.29 లక్షల ఎక్ష్ షోరూం ధరతో ఉంది. టాప్ మోడల్ రూ.13.98 లక్షల వరకు విక్రయిస్తున్నారు. మైలేజ్ విషయంలో ఈ కారు ది బెస్ట్ గా చెప్పుకోవచ్చు. ఈ కారు లీటర్ కు 19.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. సీఎన్ జీ వెర్షన్ లో 25.51 కిలో మీటర్ల వరకు దూసుకెళ్తుంది. ఒక SUV వేరియంట్ లో అత్యాధునిక ఫీచర్స్ ను కలిగి, తక్కువ ధరలో మైలేజ్ ఇచ్చే కారు బ్రెజ్జా మాత్రమే అని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.