Breast Cancer: పురుషుల్లోనూ బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ లక్షణాలు కనిపిస్తే డేంజర్‌లో ఉన్నట్లే!

రొమ్ము క్యాన్సర్ కేవలం మహిళలకు మాత్రమే వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ క్యాన్సర్ పురుషులకు కూడా వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా అరుదుగా మాత్రమే పురుషుల్లో ఈ క్యాన్సర్ కనిపిస్తుంది. మరి ఈ రొమ్ము క్యాన్సర్ పురుషుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 18, 2024 2:58 pm

breast cancer boys

Follow us on

Breast Cancer: ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఈ క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. ఏటా ఎందరో ఈ రొమ్ము క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు. అయితే ఈ రొమ్ము క్యాన్సర్ కేవలం మహిళలకు మాత్రమే వస్తుందని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ క్యాన్సర్ పురుషులకు కూడా వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా అరుదుగా మాత్రమే పురుషుల్లో ఈ క్యాన్సర్ కనిపిస్తుంది. అయితే 81 శాతం మంది పురుషులకు ఈ క్యాన్సర్ వస్తుందని కొన్ని అధ్యయనాల్లో కూడా తేలింది. అసలు అబ్బాయిలకు బ్రెస్ట్ ఉండదు కదా.. ఎలా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చాలా మందికి సందేహం ఉండే ఉంటుంది. మహిళలకు రొమ్ములో ఎలా కణితులు ఏర్పడుతాయో.. పురుషులకు కూడా అలానే కణితులు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. ఇలా ఏవైనా అనుమానాస్పదంగా అనిపిస్తే పురుషులు వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. మరి ఈ రొమ్ము క్యాన్సర్ పురుషుల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

పురుషులకు చనుమొనల్లో నొప్పి, వాపు, రక్తం కారడం, అక్కడ రంగు మారడం, చర్మం పొరలుగా మారడం, దద్దుర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే నొప్పి లేకుండా కణితి కనిపించడం, చనుమొనల్లో మార్పులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. పురుషుల్లో అరుదుగా వచ్చే ఈ రొమ్ము క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పకుండా జాగ్రత్త వహించాలి. క్యాన్సర్‌ను మొదటి స్టేజ్‌లోనే గుర్తించి చికిత్స తీసుకుంటే కాస్త ప్రమాదం తగ్గుతుంది. క్యాన్సర్ ఏ దశలో ఉందో తెలుసుకుని దాని బట్టి చికిత్స చేస్తారు. అయితే 50 ఏళ్లు పైబడిన పురుషుల్లో ఎక్కువగా ఈ క్యాన్సర్ కనిపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. పురుషుల్లో బ్రెస్ట్‌లో ఏ చిన్న మార్పులు వచ్చిన కూడా బ్రెస్ట్ స్క్రీనింగ్ తప్పకుండా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వంశపారంపర్యంగా ఎవరికైనా క్యాన్సర్ ఉండటం, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా పురుషుల్లో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

 

పురుషుల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పురుషులు మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఊబకాయం ఉంటే బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. టెస్టోస్టిరాన్ హార్మోన్ స్థాయిలు పెరగకుండా చూసుకోవాలి. పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వీటితో పాటు జీవనశైలిని మార్చాలి. వ్యాయామం, యోగా వంటివి చేయాలి. బయట ఫుడ్‌కి కాస్త దూరంగా ఉండాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి. అప్పుడే క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. రొమ్ము క్యాన్సర్ పురుషులకు రాదని ఇకపై లైట్ తీసుకోవద్దు. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది. ఈ సూచనలు పాటించే ముందు పండితులను సంప్రదించగలరు.