Breakfast: ఈరోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం పోషకాలు ఉన్న ఫుడ్ తినకపోవడమే. దీనివల్ల చాలా మంది పిల్లలు చిన్నప్పటి నుంచే పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నతనంలో సరైన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల చాలా మంది పిల్లలు కొన్ని సమస్యల లోపంతో ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు సరైన పోషకాలు ఉండే ఫుడ్ పెట్టకపోతే వారు విటమిన్ల లోపంతో బాధపడతారు. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మానసికంగా బాధ పడటం వంటి సమస్యల బారిన పడతారు. అలాగే పిల్లలకు భవిష్యత్తులో టైప్ 1 డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పిల్లలు ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే వారి బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాలు ఉండే కొన్ని ఫుడ్స్ యాడ్ చేయాలి. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
అవకాడో
ఆరోగ్యానికి అవకాడో ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ కంటే మంచి కొలెస్ట్రాల్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. దీన్ని పిల్లలకు పెట్టడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడరు. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ అవకాడతో బ్రెడ్ వంటివి చేసి పిల్లలకు పెట్టడం వల్ల రోజంతా వారి కడుపు కూడా నిండుగా ఉంటుంది. మసాలా వంటివి కాకుండా ఇలాంటి పోషకాలు ఉండే వాటిని పిల్లలకు పెట్టడం వల్ల వారి ఆరోగ్యానికి మంచిది.
డ్రైఫూట్స్
పిల్లలకు ఉదయం పూట డ్రైఫూట్స్ తినడం అలవాటు చేయాలి. ఇందులోని పోషకాలు పిల్లలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు కండరాలు బలంగా పనిచేసేలా చేస్తాయి. బాదం, వాల్‌నట్స్ వంటి వాటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే ఇవ్వడం వల్ల పిల్లలు రోజంతా యాక్టివ్‌గా కూడా ఉంటారు.
బెర్రీస్
బెర్రీస్ జాతికి చెందిన పండ్లను పిల్లలకు ఉదయాన్నే ఇవ్వాలి. దీనివల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఈ బెర్రీస్‌లో యోగర్ట్ కలుపుకుని పిల్లలకు పెట్టడం వల్ల రోజంతా చాలా ఎనర్జీతో ఉంటారు. వీటితో పాటు పాలు, డ్రైఫూట్స్ పౌడర్ వేసి పిల్లలకు ఇవ్వడం వల్ల కూడా వారి ఆరోగ్యానికి మంచిది.
గుడ్లు
గుడ్లలో ప్రోటీన్లు ఎక్కువుగా ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. రోజుకి రెండు గుడ్లు పిల్లలకు ఉడికించి ఇవ్వడం వల్ల వారు ఎంతో బలంగా ఉంటారు. గుడ్లులో ప్రొటీన్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో బాగా సహాయపడతాయి.
ఓట్స్
పిల్లలకు ఉదయం పూట బజ్జీ, దోస అంటూ టిఫిన్స్ పెట్టే బదులు ఓట్స్ పెట్టడం ఆరోగ్యానికి మంచిది. అన్నింటి కంటే ఇదే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్. దీన్ని పిల్లలు తినడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లలను అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ఓట్స్‌లో హెల్తీ ఫ్యాట్, హెల్తీ కేలరీలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి దీర్ఘకాలికంగా బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.