https://oktelugu.com/

BP: రక్తపోటు అదుపులో ఉండాలంటే.. డైలీ ఈ ఒక్క పని చేస్తే చాలు

బీపీ అదుపులో ఉండాలంటే మందులు వాడటం, ఏవైనా పెద్దగా పనులు చేయడం వంటివి చేయక్కర్లేదు. డైలీ కేవలం ఒక చిన్న పని చేస్తే చాలు. బీపీ తప్పకుండా అదుపులో ఉంటుంది. మరి డైలీ చేయాల్సిన ఆ పని ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 19, 2024 / 12:54 AM IST

    blood pressure

    Follow us on

    BP: సాధారణంగా ఒక్కోరి బాడీ ఒక్కోలా ఉంటుంది. కొందరికి బీపీ ఎక్కువగా ఉంటే మరికొందరికి తక్కువగా ఉంటుంది. ఇది కాస్త ఎక్కువైన, తక్కువైన కూడా ప్రమాదమే. పూర్తిగా ఆహారం తీసుకోకపోవడం, పోషకాలు లేని ఫుడ్ తీసుకోవడం వల్ల కొందరికి బీపీ తగ్గిపోతుంది. మరికొందరు సాల్ట్, ఫాస్ట్‌ఫుడ్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ పెరిగిపోతుంది. దీనివల్ల కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతారు. ఏ మాత్రం చిన్న తేడా బాడీలో కనిపించినా సరే వెంటనే వైద్యుని సంప్రదించాలి. బీపీ తక్కువగా ఉందని కళ్లు తిరిగినట్టి అనిపిస్తే అసలు లైట్ తీసుకోకూడదు. కొందరికి ఒక్కసారిగా పైకి నిల్చున్న కూడా తల తిరిగినట్లు అనిపిస్తుంది. ఇలా అనిపిస్తే మాత్రం వారికి బీపీ తక్కువగా ఉన్నట్లే అని అర్థం చేసుకోవాలి. అయితే బీపీ అదుపులో ఉండాలంటే మందులు వాడటం, ఏవైనా పెద్దగా పనులు చేయడం వంటివి చేయక్కర్లేదు. డైలీ కేవలం ఒక చిన్న పని చేస్తే చాలు. బీపీ తప్పకుండా అదుపులో ఉంటుంది. మరి డైలీ చేయాల్సిన ఆ పని ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

     

    ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా డైలీ వాటర్ తాగాలి. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అయితే డైలీ వాటర్ తాగడం వల్ల బీపీ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల శరీరం హైడ్రేట్ కాకుండా ఉంటుంది. దీంతో రక్తనాళాలకు విశ్రాంతి దొరుకుతుంది. దీనివల్ల కారణంగా రక్తం కూడా ఈజీగా ప్రసరణ చెందడంతో బీపీ అదుపులో ఉంటుంది. బాడీలో నీరు తగ్గితే రక్తం ప్రసరణ సరిగ్గా జరగదు. దీంతో బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రోజూ నీరు తాగడం వల్ల మూత్రపిండాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. అయితే ఒక్క నీరు తాగితే సరిపోదు. ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకునే ఆహారంలో ఎక్కువగా సోడియం లేకుండా చూసుకోవాలి. అలాగే రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చేస్తే బీపీ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

     

    బీపీ రోజుకి 5 గ్రాముల కంటే ఎక్కువ సాల్ట్ తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో సగం తినడం వారి ఆరోగ్యానికి మంచిది. సోడియం ఎక్కువగా బాడీకి తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే సాధారణ సాల్ట్ లేదా పింక్ సాల్ట్‌ను కూడా ఎక్కువగా తినకూడదు. చాలా మంది పింక్ శాల్ట్ ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఇందులో ఉండే అర్సెనిక్, మెర్క్యూరీ, లీడ్ వంటివి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి వీటిని అధిక మోతాదులో అసలు తీసుకోకూడదట. అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీంతో గుండె పోటు ప్రమాదాలు, దీర్ఘకాలిక మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఉప్పు తీసుకుంటే శరీరంలో కాల్షియం తగ్గిపోతుంది. దీంతో బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్ వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంది.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.