Bones Health: వయస్సు పెరగడం, జీవనశైలిలో మార్పులు వల్ల చాలా మంది ఈ రోజుల్లో ఎముకల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వయస్సు పెరిగిన తర్వాత అనారోగ్య సమస్యలు రావడమనేది సాధారణమే. కానీ పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఈ రోజుల్లో చాలామంది ఎముకల సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి అయిన విముక్తి చెందాలంటే ముఖ్యంగా చేయాల్సింది ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాడీకి ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు తీసుకోకపోవడం వల్లే అనారోగ్య సమస్యలు వస్తాయి. కొందరు పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోకపోవడం వల్ల ఎక్కువగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటికి ముందే జాగ్రత్త వహించకపోతే ఆర్థరైటిస్, బోలు ఎముకల వ్యాధులు బారిన పడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో కొందరు యంగ్ ఏజ్‌లోనే వీటి బారిన పడుతున్నారు. ఈ సమస్య వస్తే నడవడం, ఎక్కువ సమయం కూర్చోలేకపోవడం, తమ పనులు చేసుకోవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాయామం వంటివి చేయాలి. అయితే ఎముకల సమస్యలు ఉన్నవారు ఈ బెరడును ఆహారంలోకి వాడితే తప్పకుండా విముక్తి చెందవచ్చు. ఇంతకీ ఆ బెరడు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
మనలో చాలామందికి అర్జున చెట్టు బెరడు తెలియదు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యంతో పాటు ఎముకల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఈ అర్జున చెట్టు బెరడుతో గుండె పోటు, రక్తపోటు వంటి సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇందులోని బెరడును ఇతర వనమూలికలతో కలిపి తీసుకోవడం వల్ల అన్ని సమస్యల నుంచి విముక్తి చెందుతారు. అయితే ఈ బెరడు దొరకడం కష్టమే. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎముకలు దెబ్బతినకుండా కాపాడుతుంది. దీనిని కొందరు టీలో వేసుకుని కూడా తాగుతారు. అలాగే ఎముకల సాంద్రతను పెంచడానికి కూడా సాయపడుతుంది. అయితే ఈ అర్జున బెరడు ఎక్కువ అడవుల్లో దొరుకుతుంది.
అర్జున చెట్టు బెరడులో ఉండే పోషకాలు శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సాయపడుతుంది. ఇందులోని పోషకాలు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేస్తుంది. ఇవి శరీరంలో ఉండే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో రక్తపోటు అదుపులో ఉండే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది గుండె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఈ అర్జున చెట్టు బెరడును తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఈ అర్జున చెట్టు బెరడును పాలలో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుందట. బరువు పెరుగుతున్న వారు దీన్ని తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపించడంలో అర్జున చెట్టు బెరడు బాగా ఉపయోగపడుతుంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.