https://oktelugu.com/

Body Dehydration: బాడీ డీహైడ్రేషన్ అవుతుందా? అయితే ఈ సమస్యలు మీకు తప్పవు

ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న కూడా బాడీ డీహైడ్రేట్ అవుతుంటే.. తప్పకుండా వైద్యుని సంప్రదించాలి. లేకపోతే కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి చేయడం వల్ల శరీరానికి వచ్చే ఆ అనారోగ్య సమస్యలు ఏంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 31, 2024 / 10:18 PM IST

    Body Dehydration

    Follow us on

    Body Dehydration: నీరు అనేది శరీరానికి తప్పకుండా అవసరం. ఒక్క రోజు నీరు తాగకపోతే బాడీలో చాలా మార్పులు కనిపిస్తాయి. నీరు తాగకపోతే బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. కొందరు నీరు తాగిన తాగకపోయిన బాడీ డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇలా అయితే అనారోగ్యానికి చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాడీ హైడ్రేట్‌గా ఉండాలంటే ఎన్నో చిట్కాలు పాటించాలి. లేకపోతే సమస్యలు తప్పవు. బాడీ హైడ్రేట్‌గా ఉండాలంటే కొబ్బరి నీరు, సబ్జా వాటర్ వంటివి తీసుకోవాలి. అలాగే మజ్జిగ తాగుతుండాలి. బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ అయితే అసలు తినకూడదు. వీటివల్ల బాడీ వేడి చేస్తుంది. కొందరు గంటల తరబడి వాటర్ తాగకుండా ఉంటారు. దీనివల్ల కూడా వారి బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న కూడా బాడీ డీహైడ్రేట్ అవుతుంటే.. తప్పకుండా వైద్యుని సంప్రదించాలి. లేకపోతే కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి చేయడం వల్ల శరీరానికి వచ్చే ఆ అనారోగ్య సమస్యలు ఏంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న కూడా బాడీ డీహైడ్రేట్ అవుతుంటే.. తప్పకుండా వైద్యుని సంప్రదించాలి. లేకపోతే కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి చేయడం వల్ల శరీరానికి వచ్చే ఆ అనారోగ్య సమస్యలు ఏంటో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.

    చర్మంపై మొటిమలు
    బాడీ డీహైడ్రేషన్‌కి గురైతే చర్మంపై మొటిమలు వస్తాయి. చర్మం కాంతివంతంగా లేకుండా దెబ్బతింటుంది. ముఖ్యంగా చర్మంపై ముడతలు, దురద వంటివి కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తు్న్నారు.

    అలసట
    నీరు తాగకపోవడం వల్ల కొందరికి అలసట వస్తుంది. పూర్తి ఎనర్జీ తగ్గుతుంది. అలాగే తలనొప్పి కూడా వస్తుంది. ఇది కాస్త మైగ్రేషన్‌కి దారితీస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

    మలబద్ధకం
    బాడీ డీహైడ్రేషన్‌ అయితే జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. దీంతో మలబద్ధకం సమస్య తప్పకుండా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల పేగు ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. మలబద్ధకం లేకుండా సరిగ్గా మూత్ర విసర్జన కావాలంటే తప్పకుండా వాటర్ ఎక్కువగా తాగుతుండాలి.

    యూరిన్ రంగులో మార్పులు
    బాడీ డీహైడ్రేషన్ అయితే యూరిన్‌లో రంగు మారుతుంది. పసుపు లేద గోధుమ రంగులోకి మారుతుంది. అప్పుడే మీ బాడీ బాగా డీహైడ్రేషన్ అయ్యిందని గుర్తించవచ్చు. వాటర్ ఎంత ఎక్కువగా తాగతే అంత మంచిది. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఆరోగ్యంగా ఉంటారు.

    నోటి దుర్వాసన
    బాడీ డీహైడ్రేషన్‌ వల్ల నోటిలో దుర్వాసన వస్తుంది. శరీరానికి తగినంత నీరు లేకపోతే లాలాజలంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు తగ్గుతాయి. ఇవి నోటి దుర్వాసనకి కారణమవుతాయి. దాహం వేసిన వేయకపోయిన వాటర్ అప్పుడప్పుడు తాగుతూనే ఉండాలి.

    కండరాల నొప్పి
    కండరాల ఆరోగ్యానికి వాటర్ చాలా ముఖ్యమైనది. నీరు తాగకపోతే బాడీ డీహైడ్రేషన్‌కి గురై.. కండరాల నొప్పిని పెంచుతుంది. కాబట్టి బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. దీనికోసం నిమ్మకాయ నీరు, వాటర్ ఎక్కువగా తాగడం, పండ్ల రసాలు, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఆహారం విషయంలో కూడా బాడీకి చలవ చేసే పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. లేకపోతే మళ్లీ ఈ సమస్యలన్నీ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.