Blood Pressure: ప్రస్తుతం చలి తీవ్రత పెరిగిపోతుంది. దీంతో కొందరికి రక్తపోటు అధికం అవుతుంది. తక్కువ ఉష్ణోగ్రతల వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీంతో చలికాలంలో అధిక రక్తపోటు వస్తుంది. వేసవి కాలంతో పోలిస్తే చలికాలంలో రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం చల్లని ఉష్ణోగ్రతలు అని నిపుణులు చెబుతున్నారు. అయితే చలికాలంలో రక్తపోటు పెరిగితే చాలా ప్రమాదం. ఒక్కోసారి గుండె పోటు కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే రక్తపోటు పెరిగితే శరీర భాగాలకు రక్తం సరఫరా కాదు. దీంతో అవయవాలు పనిచేయవు. అయితే చలికాలంలో రక్తపోటు పెరగకుండా అదుపులో ఉండాలంటే మాత్రం తప్పకుండా కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ రోజు స్టోరీలో చూద్దాం.
మిమ్మల్ని మీరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి
శీతాకాలంలో వెచ్చగా ఉండటానికి ప్రయత్నించాలి. శరీరానికి వేడిగా ఉండే పదార్థాలు తినాలి. చల్లని పదార్థాలు అసలు తీసుకోకూడదు. అలాగే చల్ల గాలి తగలకండా స్వెటర్లు, గ్లౌజ్‌లు వంటివి ధరించాలి. వీటితో వేడి నీరు తాగాలి. బయట గాలి తగలకుండా దుస్తులు ధరించాలి. ఇంట్లోకి బయట చల్లని గాలులు రాకుండా సెట్ చేసుకోవాలి. రాత్రి సమయాల్లో పెద్ద దుప్పట్లను కప్పుకోవాలి. ఇలా చేస్తే మీ బాడీ వేడిగా ఉంటుంది. లేకపోతే చల్లదనం అయ్యి ఒక్కసారిగా మీ రక్తపోటు పెరిగిపోతుంది.
వ్యాయామం చేయడం
చలి వల్ల కొందరు వ్యాయామం చేయరు. అయితే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. వ్యాయామం చేయడం వల్ల బాడీలోని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. చలికి పట్టేయకుండా ఉంటాయి. అలాగే శారీరక శ్రమ ఉండటం వల్ల రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం చేయలేకపోతే కనీసం మెడిటేషన్ అయినా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మెడిటేషన్ వల్ల ఒత్తిడి, ఆందోళన అన్ని కూడా తగ్గిపోతాయి.
ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవాలి
చలి కాలంలో ప్రొటీన్లు ఉండే ఆరోగ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. పండ్లు, తృణ ధ్యాన్యాలు, లీన్ ప్రొటీన్లు వంటివి తీసుకోవాలి. కొందరు స్పైసీ ఉండాలని ఫాస్ట్ ఫుడ్ తింటారు. ఇవి ఆరోగ్యానికి అంత మంచివి కాదు. రక్తపోటును పెంచడానికి దోహదపడతాయి. కాబట్టి వీటి జోలికి అసలు వెళ్లవద్దు. తినే ఫుడ్‌లో పొటాషియం, మెగ్నీషియం వంటివి కూడా ఉండేలా చూసుకోండి.
ఉప్పు తక్కువగా తీసుకోండి
చలికాలంలో ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఎక్కువగా సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పును ఎక్కువగా తీసుకోవద్దు. కాస్త లిమిట్‌లో మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పండ్లు తినండి
డైలీ డైట్‌లో పండ్లను తప్పకుండా చేర్చుకోండి. ఇవి అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. ముఖ్యంగా అరటిపండ్లు, సిట్రస్ పండ్లు, జామ వంటివి తీసుకోవాలి. ఇందులోని పొటాషియం, సిట్రిక్ ఆమ్లం రక్తపోటును నియంత్రించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.