Black Carrot: క్యారెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులోని పోషకాలు అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే మనం తరచుగా మార్కెట్‌లో కేవలం ఎర్రగా ఉండే క్యారెట్లను చూస్తుంటాం. వీటినే ఎక్కువగా అందరూ తింటారు. అయితే క్యారెట్‌లో ఆరెంజ్, రెడ్ మాత్రమే కాకుండా ఇంకో రకం క్యారెట్లు కూడా ఉన్నాయి. ఎవరూ ఉహించని విధంగా నల్లని క్యారెట్లు కూడా ఉన్నాయి. వీటి గురించి ఎవరికి పెద్దగా తెలియదు. వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల క్యారెట్‌లలో అధిక ఆంథోసైనిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి, మంటను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే గుండె సమస్యలు రాకుండా కూడా క్యారెట్లు బాగా సహాయపడతాయి. సాధారణ క్యారెట్లలో ఉన్నట్లే నల్ల వాటిలో కూడా విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందిస్తుంది. అయితే ఈ బ్లాక్ క్యారెట్ల వల్ల కలిగే ఆ లాభాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.
వాపును తగ్గిస్తుంది
బ్లాక్ క్యారెట్‌లోని అధిక ఆంథోసైనిన్ కంటెంట్ వాపును తగ్గిస్తుంది. అలాగే శరీరంలో నొప్పులు లేకుండా చేస్తుంది. ఎలాంటి ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్, న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి.
కావాల్సిన పోషకాలు అన్ని ఉన్నాయి
నల్ల క్యారెట్లలో మన ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి. ఇందులో వాటిలో విటమిన్ ఎ కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రోజూ ఈ నల్ల క్యారెట్లను తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
జీర్ణ క్రియ ఆరోగ్యం
బ్లాక్ క్యారెట్‌లో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తగినంత ఫైబర్ తీసుకోకపోతే పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అదే ఈ నల్ల క్యారెట్‌ను తింటే ఈ సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది.
మధుమేహాం తగ్గుతుంది
నల్ల క్యారెట్ల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. రోజుకి చిన్న ముక్క అయిన నల్ల క్యారెట్ తినడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందుతారు.
దృష్టిని మెరుగుపరుస్తుంది
క్యారెట్‌లో లభించే బీటా-కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. డైలీ తినడం వల్ల చర్మ మెరుస్తుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.
ఎవరెవరు తినకూడదంటే?
ఈ బ్లాక్ క్యారెట్లను కిడ్నీ, మూత్ర పిండాల సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకుంటే వైద్యుల సూచనలు మేరకు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.