Black cardamom: యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా ఇవి ఆకుపచ్చని రంగులో ఉంటాయి. ఈ యాలకులను ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. వీటిని వాడటం వల్ల వంటలు టేస్టీగా వస్తాయి. ముఖ్యంగా వీటిని డైలీ టీలో వాడుతుంటారు. యాలకులతో టీ చేయడం వల్ల టేస్టీగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. యాలకులను స్వీట్లు, తీపి పదార్థాలు వంటి వాటిలో ఉపయోగిస్తారు. అలాగే వంటల్లో మసాలా దినుసులుగా కూడా ఉపయోగిస్తారు. యాలకులను మసాలా దినుసుల్లో రారాణిగా పిలుస్తుంటారు. డైలీ వీటిని నమలడం వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే మనకు మార్కెట్లో ఎక్కువగా ఆకుపచ్చ యాలకులే కనిపిస్తుంటాయి. కానీ యాలకుల్లో చాలామందికి నల్ల రంగు గురించి పెద్దగా తెలియదు. కేవలం ఆకుపచ్చ యాలకులు మాత్రమే ఉన్నాయని అందరూ అనుకుంటారు. కానీ నల్లగా ఉండే యాలకులు కూడా ఉన్నాయి. వీటిలోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. మరి నల్ల యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు
నల్ల యాలకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటిని నాశనం చేయడానికి సాయపడతాయి. డైలీ వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా సీజనల్‌గా వచ్చే వ్యాధులు అన్నింటిని క్లియర్ చేయడంలో బాగా సహాయపడతాయి. జలుబు, దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తాయి.
కాలేయం ఆరోగ్యం
నల్ల యాలకులు కాలేయ ఆరోగ్యాన్ని మేలు చేయడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి శరీరంలో ఉండే వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. ఇందులోని పోషకాలు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆకుపచ్చ యాలకులకు బదులు నల్ల యాలకులను వాడితే కాలేయ సమస్యలు అన్ని దూరం అవుతాయి.
గుండె ఆరోగ్యం
వీటిని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. టీ లేదా వంటల్లో వాడటం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. నల్ల యాలకుల వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. కాబట్టి రోజూ ఏదో విధంగా నల్ల యాలకులను తినడం అలవాటు చేసుకోండి.
దంతాల ఆరోగ్యం
దంతాల సమస్యలు ఉన్నవారు ఈ యాలకులను తినాలి. వీటిని తినడం వల్ల దంతాల సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. తరచుగా తీసుకోవడం వల్ల నోటిలోని క్రిములు అన్ని కూడా నాశనం అవుతాయి. దీనివల్ల నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. డైరెక్ట్‌గా కూడా వీటిని తినవచ్చు. లేకపోతే టీ, వంటల్లో ఏదో రకంగా అయిన వాడుకోవాలి.
జీర్ణక్రియ ఆరోగ్యం
నల్ల యాలకులను తినడం వల్ల జీర్ణ సమస్యలు అన్ని తగ్గుతాయి. అలాగే అజీర్తి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు అన్ని కూడా క్లియర్ అవుతాయి. డైలీ తినడం వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు తగ్గడంతో పాటు ఆకలి కూడా మెరుగుపరుతుంది. డైరెక్ట్‌గా నల్ల యాలకులను కాకుండా పొడిని అయిన కూడా వాడవచ్చు. బిర్యానీ, వంటలు, కూరలు, టీవీ, పాయసం వంటి వాటిలో కూడా వీటిని వాడవచ్చు. నల్ల యాలకులను తినడం ఇష్టంలేకపోతే పౌడర్ చేసి వాటర్ కూడా తాగవచ్చు. ఇలా కనీసం వారానికి ఒకసారి అయిన చేయడం వల్ల అన్ని అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.