Lychee Fruit: మనసుంటే మార్గం ఉంటుంది. సంపాదించాలన్న లక్ష్యం ఉంటే గవర్నమెంట్ జాబ్ కావాల్సిన అవసరం లేదు. ఆశయం ఉన్నతమైనది అయితే.. దానిని సాధించాలన్న పట్టుదల ఉంటే.. లక్ష్యం చేరడం పెద్ద కష్టం కాదని ఎంతోమంది నిరూపించారు. తాజాగా బీహార్‌కు చెందిన ఓ నిరుద్యోగి కూడా ఉద్యోగం రాలేదని తెగ బాధ పడిపోవాల్సిన అవసరం లేదంటున్నాడు. డబ్బులు సంపాదించాడానికి అనేక మార్గాలున్నాయని నిరూపించాడు.
జాబ్ రాలేదని..
జాబ్ బెటరా.. బిజినెస్ బెటరా అంటే అది ఆ వ్యక్తి పరిస్థితులు బట్టి ఉంటుంది. కొంతమందికి పెట్టుబడి పెట్టుకునేందుకు డబ్బులు ఉండవు.. మరికొంతమందికి జాబ్ ఉండదు.. అయితే ప్రస్తుతం మనీ సంపాదించాడనికి చాలా మార్గాలున్నాయి. అందుకే జాబ్ రాకపోతే ఫీల్ అవ్వకుండా తర్వాత ఏం చేయాలన్న దానిపై పూర్తిగా ఫోకస్ పెడితే డబ్బులు వాటంతట అవే వస్తాయి. బిహార్ సమస్తిపూర్‌కు చెందిన విజయ్‌కు ఉద్యోగం రాలేదు. కానీ నిరాశపడలేదు. తనకు వ్యవసాయంపై ఆసక్తి ఉండడంతో రైతుగా మారాడు. లిచ్చి(పండ్ల తోట) సాగుచేస్తూ లక్షలు సంపాదిస్తున్నాడు.
5 ఎకరాల్లో సాగు..
బిహార్‌లోని బర్హేటా గ్రామానికి చెందిన విజయ్‌కుమార్‌దేవ్ బీఎస్సీ ఫిజిక్స్ పూర్తిచేశాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వేటలో పడ్డాడు. ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో రైతుగా మారాడు. ఖాళీగా ఉన్న తమ 5 ఎకరాల్లో లిచ్చి సాగు మొదలు పెట్టాడు. ఒక్క సీజన్‌లో రూ.5 లక్షలు సంపాదిస్తున్నాడు.
25 ఏళ్లుగా సాగు..
విజయ్ కుమార్ దేవ్ 25 ఏళ్లుగా తన పొలాల్లో లిచ్చి సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నాడు. 50 చెట్లతో లిచ్చి హార్టికల్చర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత లిచ్చి తోటల పెంపకం క్రమంగా పెరుగుతూ వచ్చిందన్నాడు. దాదాపు 5 ఎకరాల్లో లిచ్చి గార్డెనింగ్ చేస్తున్నానని చెప్పాడు. లిచ్చి తోటల పెంపకం కోసం గ్రామంలోని పెద్దల సలహా తీసుకున్న విజయ్ కుమార్ దేవ్ పూసాలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో లిచ్చి తోటల పెంపకంలో శిక్షణ తీసుకున్నాడు. ఆపై అతను ఎప్పటికప్పుడు హార్టికల్చర్‌ను శాస్త్రీయంగా నిర్వహించేవాడు. ఇందుకోసం రైతులు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల నుంచి ఎప్పటికప్పుడు సలహాలు తీసుకుంటున్నారు.
శాస్త్రవేత్తల సలహాతో పంట బాగా పండింది.. ఆ తర్వాత వాటి పండ్లకు మార్కెట్‌లో గిరాకీ ఏర్పడింది.. ఆ తర్వాత పెద్ద ఎత్తున లిచ్చి తోటల పెంపకం చేపట్టారు. ఇప్పుడే ఏటా రెండు సీజన్లలో సుమారుగా రూ.10 లక్షల వరకు సంపాదిస్తున్నాడు.