DSP, THAMAN:సంగీతంతో మనసు ఎంతో ఉల్లాసంగా మారుతుంది. మంచి మ్యూజిక్ తో ప్రాణాలే లేస్తాయని కొందరు వైద్యులు రోగులకు ఇష్టమైన మ్యూజిక్ ను వినిపిస్తారు. కొన్ని విషయాలను నార్మల్ గా కాకుండా మ్యూజిక్ తో చెప్పడంతో అవి అందంగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇష్టమన వారికి శుభాకాంక్షలు చెప్పాలనుకునేవారు సినీ సాంగ్స్ తో పాటు అందమైన గొంతుతో చెబితే వారిని ఇంప్రెస్ చేసిన వారవుతారు. అయితే మన గొంతు అందంగా లేకపోయినా కొన్ని వెబ్ సైట్లు వాటిని అందిస్తున్నాయి. మరి అందమైన గొంతుతో ఇష్టమైన వారికి శుభాకాంక్షలు ఎలా చెబుతారో తెలుసా?
కాలం మారుతున్న కొద్దీ మొబైల్ ప్రధానమైపోతుంది. ప్రతీ పనిని ఫోన్ ద్వారా చేస్తున్నారు. పలు కారణాల వల్ల మనుషులు దూరంగా ఉన్నా మొబైల్ కమ్యూనికేషన్ తో నిత్యం పక్కనే ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో శుభాకాంక్షలు కూడా ఫోన్ ద్వారా చెబుతున్నారు. అయితే ఫోన్ ద్వారా శుభాకాంక్షలను ఒకప్పుడు మెసేజ్ పెట్టి ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు వాయిస్ మెసేజ్ కూడా అందుబాటులోకి రావడంతో మంచి గొంతుతో శుభాకాంక్షలు చెప్పి వారిని ఆకట్టుకోవాలని చూస్తున్నారు.
ఉదాహరణకు దగ్గరి స్నేహితుడికి హ్యాపీ బర్త్ డే శుభాకాంక్షలను అందమైన గొంతుతో చెప్పాలనుకుంటారా? అయితే గూగుల్ లోకి వెళ్లి 1Happybirthdaysong అని టైప్ చేయాలి. ఆ తరువాత ఇందులో విషెష్ అనే ఆప్షన్ లోకి వెళ్లాలి. ఆ తరువాత birthday అని ఉన్న ట్యాబ్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారో.. వారి పేరును సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత అనుకున్న పేరుతో విషెష్ చెప్పే సాంగ్ తయారువుతుంది.
ఈ మ్యూజిక్ ను డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన వారికి సెండ్ చేయండి. అప్పుడు రిసీవ్ చేసుకున్న వారు చాలా ఇంప్రెస్ గా ఫీలవుతారు. ఒక్కోసారి మంచి మ్యూజిక్ కోసం ఎన్నో వెతుకుతుంటాం. కానీ కావాల్సిన పేరు మీద మ్యూజిక్ దొరకదు. ఇటువంటి సమయంలో కావాల్సిన వ్యక్తి కోసం ఇలా చేసి వారి నుంచి మన్ననలు పొందవచ్చు.