Best Tourist Beaches: మన దేశ భౌగోళిక స్వరూపమే కాకుండా మన ఆచార వ్యవహారాలు కూడా విచిత్రంగా ఉంటాయి. అనేక మతాలున్న లౌకిక దేశం కావడంతో ఇక్కడ అనేక భాషలు, అనేక మతాలు, అనేక ప్రాంతాలు తమ ఉనికిని చాటుతున్నాయి. భిన్నత్వంలో ఏకత్వమే మన లక్షణం. అందుకే ప్రపంచ దేశాలన్ని మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటాయి. అంతటి ఖ్యాతి గాంచిన మన దేశంలో ఎన్నో సుందర పట్టణాలు ఉన్నాయి. అందులో పింక్ సిటీగా జైపూర్ ను పిలుస్తారు. గులాబీల నగరంగా బెంగుళూరును కొనియాడతారు.

మన దక్షిణ భారత దేశంలో అనేక వైవిధ్యమైన ప్రాంతాలున్న సంగతి తెలిసిందే. ఇక్కడ బీచ్ లు కూడా మనకు కనువిందు చేస్తాయి. వేసవి కాలంలో బీచులలో ఉంటే ఆ సరదాయే వేరు. అందుకే కొత్తగా పెల్లయిన జంటలు హనీమూన్ కోసం బీచ్ లున్న ప్రాంతాలను ఎన్నుకుని మరీ తమ ప్రయాణాలు కొనసాగిస్తారు. జంటగా వెళ్లి అక్కడ భార్యతో ఎంజాయ్ చేసి సరదాలు తీర్చుకుని హాయిగా గడుపుతారు.
Also Read: Ex Minister Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు? పేపర్ లీక్ వ్యవహారమే కారణమా?
ఇక బీచ్ ల విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం బంగాళాఖాతం ను ఆనుకుని ఉండటంతో ఇక్కడ బీచ్ కు పర్యాటకులు బాగానే వస్తుంటారు.ఇక్కడ రామకృష్ణ బీచ్ అత్యంత ప్రముఖమైనది. ఈ ప్రాంతంలో సూర్యాస్తమయం అద్భుతంగా ఉంటుంది. అందాలను వీక్షించాలనుకునే వారికి ఈ బీచ్ ఎంతో అందంగా ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాల్లో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి. దీంతో బీచ్ ను సందర్శించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

మరో బీచ్ కర్ణాటక రాష్ట్రంలోని గోకర్ణలో ఉంది. దీని పేరు ఓం. చాలా ఫేమస్. అద్భతమైన అందచందాలు దీని సొంతం. పర్యాటకంగా సాంస్కృతికంగా ఇది ఎంతో ప్రసిద్ధి. అందుకే ఇక్కడికి ఎక్కువ మంది వస్తుంటారు. తమ టూర్ ను సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడకు వచ్చి సరదాగా గడుపుతారు. ఇంకా చెన్నైలోని ఇలియట్ బీచ్ కూడా ఎంతో ప్రసిద్ధ చెందింది. కుటుంబ సమేతంగా వచ్చి వెళ్లేఅందుకు అనువుగా ఉంటుంది.

ఇక్కడ చక్కని వాతావరణం ఉంటుంది. చెన్నై నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ బీచ్ చుట్టు కూడా అనేక దేవాలయాలు ఉన్నాయి. మరో బీచ్ అండమాన్ నికోబరార్ బీచ్. ఇక్కడ ప్రకృతి అందాలు పరవశానికి గురి చేస్తాయి. కొత్తగా పెళ్లయిన జంటలు ఎక్కువగా వస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఇంకా కొచ్చిలోని చెదాయ్ బీచ్, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి వంటి ప్రదేశాలు ఆకట్టుకుంటాయి.
Also Read: YSR Congress Alliance: పొత్తులపై మాట మార్చిన వైసీపీ