https://oktelugu.com/

Best Smartphones: రూ.15,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ మొబైల్స్ ఇవే.. వెంటనే బుక్ చేసుకోండి..

రియ్ మీ కంపెనీ నుంచి నర్జో ఎన్ 53 మోడల్ 5జీ నెట్ వర్క్ తో అమెజాన్ లో అందుబాటులో ఉంది. 6 జీబి రామ్, 128 స్టోరేజీతో కూడిన ఈ మొబైల్ 90 హెచ్ జడ్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ మొబైల్ ను రూ.10, 999కే దక్కించుకోవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : August 4, 2023 / 02:30 PM IST

    Best Smartphones

    Follow us on

    Best Smartphones: 4జీ నుంచి 5జీ నెట్ వర్క్ మారిన తరువాత చాలా మంది కొత్త మొబైల్ కొనుగోలు చేయాలని చూస్తున్నారు. అయితే కరోనా తరువాత దాదాపు అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఎలక్ట్రానిక్ వస్తువులకూ డిమాండ్ పెరిగింది. కానీ కొన్ని కంపెనీలు సామాన్యులను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరకు మొబైల్స్ ను ఉత్పత్తి చేశాయి. అయితే వీటిలో ఉండే ఫీచర్స్ ను మాత్రం లేటేస్టుగానే అప్డేట్ చేశాయి. అయినా తక్కువ ధర అంటే కొనకుండా ఎవరు ఊరుకుంటారు. అయితే ఆ మొబైల్స్ గురించి తెలుసుకొని వెంటనే బుక్ చేసుకోండి..

    రెడ్ మీ 12 5 జీ:
    4 జీ నెట్ వర్క్ లోనూ రెడ్ మీ ఫోన్లు బాగా అమ్ముడుపోయాయి. ఇప్పుడు 5 జీ నెట్ వర్క్ గా మారి కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చింది. 4 జనరేషన్ చిప్ కలిగిన ఈ మోడల్ 2 చిప్ సెట్ కలిగి అద్భుతమైన కెమెరా ఫీచర్స్ ను కలిగి ఉంది. ఈ మొబైల్ ను రూ.10,999తో విక్రయిస్తున్నారు.

    రియల్ మీ నర్జో ఎన్ 53 5 జీ:
    రియ్ మీ కంపెనీ నుంచి నర్జో ఎన్ 53 మోడల్ 5జీ నెట్ వర్క్ తో అమెజాన్ లో అందుబాటులో ఉంది. 6 జీబి రామ్, 128 స్టోరేజీతో కూడిన ఈ మొబైల్ 90 హెచ్ జడ్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ మొబైల్ ను రూ.10, 999కే దక్కించుకోవచ్చు.

    ఐక్యూ జెడ్ 6 లైట్ 5జీ:
    ఐక్యూ నుంచి 5జీ నెట్ వర్క్ మొబైల్ అందుబాటులో ఉంది. 6 జీబీ రామ్, 128 జీబీ స్టోరేజ్ తో పాటు 4జనరేషన్ విత్ ఛార్జర్ ను అందిస్తుంది. ఈ మొబైల్ ను రూ.13,249తో విక్రయిస్తున్నారు.

    శాంసంగ్ గెలాక్సీ ఎమ్ 14 5జీ:
    బ్రాండెడ్ శ్యాంసంగ్ కంపెనీకి చెందిన కొత్త మోడల్ మార్కెట్లో అందుబాటులో ఉంది. అదే ‘గెలాక్సీ ఎమ్ 14 5జీ’. ఈ మొబైల్ 93హెచ్ జడ్ డిస్ ప్లేను కలిగి ఉంది. 128 జీబీ స్టోరీజీతో 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. 12 జీబీ రామ్ తో కూడిన ఈ మొబైల్ ను రూ.13, 490కే కొనుగోలు చేయొచ్చు.