India vs Pakistan Viral Memes: ఇండియన్ క్రికెట్ ప్రియులకు ఆదివారమే దీపావళి జరిగింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత్ అద్భుత విక్టరీ సాధించడం అభిమానుల్లో అంతులేని ఉత్సాహాన్ని నింపింది. మ్యాచ్ చేజారుతుందనుకున్న క్రమంలో విరాట్ కోహ్లి పోరాటం జట్టుకు గెలుపు దక్కింది. ఈ విజయంతో కేవలం ఇండియన్ క్రికెట్ వాళ్లే కాకుండా దేశంలోని ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లిపై విక్టరీ పోస్టుల పరంపర కొనసాగింది. కోహ్లిని పొగుడుతూ పెట్టిన పోస్టులు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. ఈ సందర్భంగా కొందరు మీమ్స్ ను తయారు చేసి అప్లోడ్ చేశారు. ఆ మీమ్స్ వైరల్ గా మారాయి.

ఓ వైపు దీపావళి పండుగ సంబరం.. మరోవైపు క్రికెట్ ఆనందంతో దేశ ప్రజలు నిన్న డబుల్ ఎంజాయ్ చేశారు. నరాలు తెగేలా సాగిన భారత్, పాక్ మ్యాచ్ లో ఇండియాకు మామూలు విజయం కాదని చెప్పొచ్చు. 160 పరుగుల లక్ష్యాన్ని పెట్టుకున్న భారత్ 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో తీవ్ర ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఒక రకంగా కొందరు క్రికెట్ చూడడం మానేశారు. కానీ ఎవరూ ఊహించని విధంగా కోహ్లీ ఏమాత్రం ఆందోళన చెందకుండా పోరాటాన్ని కంటిన్యూ చేశాడు. ఆయనకు తోడుగా హార్థిక్ పాండ్యా తోడుగా నిలిచాడు. అయితే ఈ విజయంలో కోహ్లి (82) నాటౌట్ గా నిలిచి అద్భుత విక్టరీని అందించాడు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కోహ్లిపై పెట్టిన మీమ్స్ ఆకట్టుకుంటున్నాయి. వాటిలో కొన్ని వైరల్ అయినవి ఇవి..
Indians celebrating Diwali pic.twitter.com/drPDRro4PI
— Sagar (@sagarcasm) October 23, 2022
ఓ వ్యక్తి బెడ్ పై పడుకుంటాడు… మరోవ్యక్తి వచ్చి ‘నువ్వు భారత్ ను గెలిపించడానికి గేర్ ను ఎలా మార్చావ్’ అని అడుగుతాడు.. ఇక్కడ పడుకున్న వ్యక్తికి విరాట్ కోహ్లి అని.. అడిగే వ్యక్తికి పాకిస్తాన్ అని పేరు పెట్టారు..దీనిని రాజబాబు అనే వ్యక్తి పోస్టు చేశాడు.
Audience: Who will save the match for us? Kohli? DK? Ashwin?
Pak bowler: pic.twitter.com/W4qC4mVEad
— Sagar (@sagarcasm) October 23, 2022
‘మా మ్యాచ్ ను ఎవరు కాపాడుతారు కోహ్లి..? డీకే..? అశ్విన్..? అని ఇండియన్ ప్రేక్షకులు అడుగుతారు. ‘నేను కాపాడుతాను..’ అని పాక్ బౌలర్ రూపంలో ఓ వ్యక్తి అంటాడు.. దీనిని సాగర్ అనే వ్యక్తి పోస్టు చేశాడు.
ఓ పాకిస్తాన్ బౌలర్ పరుగులు తీస్తూ ‘ మీరే మా హీరో.. మీరు ఎప్పటికీ మాతోనే ఉంటారు.. ఇంతకు మించి ఏం లేదు..’ అని అన్నట్లు పోస్టు చేశారు. దీనిని పీఎస్ఎల్ మీమ్స్ పోస్టు చేసింది.
How Virat Kohli changed gears to win this match: pic.twitter.com/0vu24fEK2j
— Pakchikpak Raja Babu (@HaramiParindey) October 23, 2022
ఇక ప్రధాని మాట్లాడిన ‘ఆప్ లోక్ రోనా బంద్ కర్ దియే.. మేరే తక్ హవాజ్ ఆ రాహే..’ నే వీడియోను పాకిస్తాన్ తో మాట్లాడినట్లు మీమ్స్ చేశారు. దీనిని డిఆర్ గిల్ పోస్టు చేశారు.
ప్రముఖ ఫుడ్ ఆర్డర్ సంస్థ జొమాటో కూడా ఓ సంచలన పోస్టు చేసింది. ‘డియర్ పాకిస్తాన్.. ఆర్డర్ ఏ డిఫీట్..? విరాట్ యువర్ సర్వీస్’ అంటూ పోస్టు చేసింది.
Pakistani people to Pakistani cricket team #INDvPAK #melbourneweather #T20WorldCup #RohitSharma #PakistanZindabad #PakistanVsIndia #indiaVsPakistan #india #Pakistan pic.twitter.com/UKVQMsAsZ5
— Professor ki Memes (@Professor_mems) October 23, 2022
సాగర్ అనే వ్యక్తి భారత్ ప్రజలు దీపావళి సంబరాలు చేసుకుంటున్నారని.. పాకిస్తాన్ పేరుతో ఉన్న వ్యక్తిని రైఫిల్ లో కి నెట్టేస్తారు..
ఇలా ఇండియాకు వచ్చిన విజయాన్ని సోషల్ మీడియా వేదికగా కొందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ పోస్టులపై వచ్చిన కామెంట్స్ ఆసక్తికరంగా ఉంటున్నాయి.