The Paradise second song release date: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్'(The Paradise) . దసరా చిత్రం నుండి తన మార్కెట్ పరిధి ని పెంచుకుంటూ వచ్చిన నాని , ఈసారి కొడితే కుంభస్థలం బద్దలు అన్నట్టుగా, పాన్ ఇండియన్ మార్కెట్ లక్ష్యంగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం పై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో అంచనాలు , ఒక స్టార్ హీరో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాకు ఎలా ఉంటుందో , ఆ స్థాయిలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఆ రేంజ్ లో ఉంది మరీ. ముఖ్యంగా ‘ఆయా షేర్’ పాటకు ఏ స్థాయి రెస్పాన్స్ వచ్చిందో మన కళ్లారా చూశాము. ఇప్పుడు ఏ పార్టీ కి వెళ్లిన, ఏ ఈవెంట్ కి వెళ్లినా, ఏ పబ్ కి వెళ్లినా ఈ పాట వినిపిస్తోంది.
అనిరుద్ ఆ స్థాయి మాస్ ట్యూన్ ఇచ్చాడు మరి. అయితే ఈ చిత్రం నుండి ఇప్పుడు రెండవ పాటని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. వచ్చే నెల 10 న ఈ సాంగ్ విడుదల అవ్వబోతుందట. ‘ఆయా షేర్’ మాస్ సాంగ్ కాగా, ఈసారి విడుదల చేయబోయే సాంగ్ లవ్ థీమ్ లో ఉంటుందని అంటున్నారు. సాధారణంగా మాస్ సాంగ్స్ కంటే , లవ్ సాంగ్స్ కి యూత్ లో ఎక్కువ క్రేజ్ ఉంటుంది, ఎక్కువ రీచ్ కూడా ఉంటుంది. పైగా అనిరుద్ నుండి వస్తున్న లవ్ సాంగ్ అంటే అంచనాలు ఎవ్వరూ ఊహించనంత రేంజ్ లో ఉంటాయి. క్లిక్ అయితే మాత్రం ‘ఆయా షేర్’ కంటే పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన పూర్తి వివరాలను సోషల్ మీడియా లో ప్రకటించబోతున్నారు మేకర్స్.
ఇకపోతే ఈ చిత్రం లో నాని కి జోడి గా కాయదు లోహర్ నటిస్తోంది. ‘డ్రాగన్’, ‘ఫంకీ’ చిత్రాలతో మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన ఈ యంగ్ హీరోయిన్, ఈ చిత్రం లో వెరైటీ గెటప్ లో కనిపించబోతుంది. ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. దీనికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇకపోతే ఈ చిత్రాన్ని మార్చి 26 నుండి ఆగస్టు 24 కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆ తేదీలో కూడా విడుదలయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. డిసెంబర్ నెలలో కానీ, లేదంటే వచ్చే ఏడాది సమ్మర్ లో కానీ ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. సినిమాకు బడ్జెట్ లిమిట్ దాటిపోవడం వల్లే, షూటింగ్ సకాలం లో పూర్తి చేయలేకపోతున్నారని అంటున్నారు విశ్లేషకులు.
