https://oktelugu.com/

Diabetes Food: షుగర్ వ్యాధిగ్రస్తులకు బెస్ట్ ఫ్రూట్.. దీని గురించి తెలుసుకోండి..

కాలానుగుణంగా కొన్ని పండ్లు మార్కెట్లో దర్శనమిస్తుంటాయి. చాలా మంది వీటిని అవైడ్ చేస్తుంటారు. కానీ ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో కచ్చితంగా తినాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : October 11, 2023 / 01:05 PM IST

    Diabetes Food

    Follow us on

    Diabetes Food: కాలం మారుతున్న కొద్దీ కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. నేటికాలంలో ప్రతీ 5గురిలో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నట్లు కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో షుగర్ కంట్రోల్ కావడానికి రోజూ తినే ఆహారమే కాకుండా కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ప్రకృతి సహజసిద్ధంగా దొరికే పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణ ఆహారం కంటే పండ్లు తినడం వల్ల అదనపు శక్తి అందుతుంది. అంతేకాకుండా తక్షణ ఎనర్జీ కోసం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలని వైద్యులు సలహాలు ఇస్తుంటారు. అయితే వీటిలో పీయర్స్ (బేరిపండ్లు) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఎందుకంటే?

    కాలానుగుణంగా కొన్ని పండ్లు మార్కెట్లో దర్శనమిస్తుంటాయి. చాలా మంది వీటిని అవైడ్ చేస్తుంటారు. కానీ ఏ కాలంలో దొరికే పండ్లను ఆ కాలంలో కచ్చితంగా తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారు. వర్షాకాలంలో ఎక్కువగా బేరిపండ్లు మార్కెట్లోలభిస్తుంటాయి. చాలా మందికి వీటి గురించి అవగాహన ఉండదు. దీంతో పట్టించుకోరు. కానీ ఇందులో ఉండే పోషకాల గురించి తెలిస్తే మాత్రం అస్సలు విడిచిపెట్టరు. చూడడానికి జామపండులా ఉండే ఇందులో ఎలాంటి పోషకాలు ఉంటాయంటే..

    బేరిపండ్లలో బోలెడు పోషకాలు ఉంటాయి. ఇందులో పోలేట్, విటమిన్ సి, కాపర్, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇందులో ఉండే పెక్టిన్ అనే పదార్థం ఫైబర్ ను కలిగి ఉంటుంది. ఇది డయాబెటీస్, షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉంచడంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ తో సంభవించే సమస్యలు ఈ పండు మెడిసిన్ లా పనిచేస్తుంది. బరువు తగ్గానుకునేవారు దీనిని కచ్చితంగా తీసుకోవలి. పియర్ తొక్కలో క్వెర్సెటిన్ ఉంటుంది. ఇది గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.

    డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు పియర్ మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. రక్తంలో ఉండే చక్కెర నిల్వలను నియంత్రించడంలో ఈ పండు సహకరిస్తుంది. అందువల్ల దీనిని షుగర్ వ్యాధిగ్రస్తులు కచ్చితంగా తినాలని కొందరు వైద్యులు సూచిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా మూత్రాశయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా ఇది నయం చేస్తుంది. బేరిలోనిఉర్సోలిక్ యాసిడ్, ఆరోమాటేస్ చర్యను నిరోదిస్తుంది. అందువల్ల ఇది ఎక్కడ కనిపించినా విడిచిపెట్టకుండా తినడానికి ప్రయత్నించడి.