Improve Brain Health Food: మనకు జ్ణాపకశక్తి అవసరం ఉంటుంది. ఏదైనా గుర్తు లేకపోతే అంతే సంగతి. అందుకే మనకు జ్ణాపక శక్తితో ఎన్నో పనులు ఉంటాయి. విద్యార్థి జీవితంలో జ్ణాపకశక్తితోనే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతుంటాం. లేకపోతే మనకు ఇబ్బందులే ఎదురవుతాయి. మనకు జ్ణాపకశక్తిని పెంచే వాటిలో కొన్ని కూరగాయలు కూడా ఉండటం సహజమే. టమాటాలకు మనలో జ్ణాపకశక్తిని పెంచే గుణం ఉంటుంది. ఇందులో ఉండే లైకోపీస్ అనే యాంటీ ఆక్సిడెంట్ మెదడు కణజాలాల్ని ప్రీరాడికల్ పాడవకుండా కాపాడతాయి. మనం ప్రతిరోజు ఆహారాల్లో టమాటా చేర్చుకోవడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది.

మెదడు, నాడీ వ్యవస్థ బాగా పనిచేయాలంటే చేపలు తీసుకోవడం మంచిది. ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ వ్ల మన జ్ణాపకశక్తి మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెంచుతుంది. సాల్మన్, ట్యునా చేపలు, చియా గింజలు, గుమ్మడి, పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే ప్రొటీన్ల వల్ల కూడా మనకు జ్ణాపక శక్తి బాగుంటుంది. జ్ణాపకశక్తి కోసం ఇనుము, విటమిన్ ఎ, డి, ఇ, బి12 వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. తృణ ధాన్యాలు కూడా మనకు శక్తిని ఇస్తాయి. బ్రౌన్ రైస్, తృణ ధాన్యాలు, చిరు ధాన్యాల్లో విటమిన్ బి నాడీవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మెదడు శక్తిని పెంచుతాయి.
డార్క్ చాక్లెట్లలో కూడా మనకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన జ్ణాపకశక్తిని రెట్టింపు చేస్తాయి. రోజుకో డార్క్ చాక్లెట్ తీసుకోవడం ఉత్తమమే. శరీరంలో నీటిస్థాయిలు కూడా సరిగా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. మెదడు చురుగ్గా ఉండాలంటే జ్ణాపకశక్తిని పెంచే ఆహారాలు తీసుకుంటేనే ప్రయోజనం కలుగుతుంది. ఇంకా మన ఆరోగ్యాన్ని కాపాడి మన జ్ణాపకశక్తిని పెంచే వాటిలో గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంది.

వాల్ నట్స్ కూడా జ్ణాపకశక్తిని పెంచుతాయి. వీటిలో ఉంటే విటమిన్ బి6, మెగ్నిషియం మెదడును కాపాడుతాయి. మెదడు సురక్షితంగా ఉండాలంటే రోజు వాల్ నట్స్ తీసుకుంటే మంచిదే. ఆకుకూరల్లో కూడా పుష్కలమైన ప్రొటీన్లు ఉంటాయి. ఇవి కూడా మన మెదడుకు మేలు చేస్తాయి. జ్ణాపకశక్తి బాగుండాలంటే వీటిని తీసుకుంటేనే సురక్షితమని గుర్తుంచుకోవాలి. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం మన ఆలోచన శక్తిని పెంచుతుంది. జ్ణాపకశక్తిని కాపాడుతుందనడంలో సందేహం లేదు.
బీట్ రూట్ కూడా మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తసరఫరాకు సహాయపడటంతో పాటు మెదడును కూడా సురక్షితంగా ఉంచుతుంది. మెదడు చురుకుదనంగా ఉండాలంటే పసుపు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే ఆరోగ్యంతోపాటు మెదడు కూడా చురుగ్గా పనిచేసేందుకు దోహదపడుతుంది.